
మాట్లాడుతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
తిరుపతి మంగళం : యువత అభ్యున్నతే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగిస్తున్నారని మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం తిరుపతి మారుతీనగరంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి మాట్లాడారు. ముందుగా పుంగనూరు నియోజకవర్గంలో సబ్‌స్టేషన్ షిఫ్ట్ ఆపరేటర్లుగా ఎంపికై న అభ్యర్థులతో ఆయన సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా నిరుద్యోగులు లేని నియోజకవర్గంగా పుంగనూరును తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. అందులో భాగంగానే పీఎల్‌ఆర్ జాబ్ మేళా ద్వారా ఇప్పటికే వేలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పించామని వెల్లడించారు. ఈ క్రమంలోనే 19 సబ్‌స్టేషన్లలో షిప్ట్ ఆపరేటర్లుగా పనిచేసేందుకు 70మందిని ఎంపిక చేసినట్లు వివరించారు. త్వరలోనే నియామక పత్రాలను సైతం అందించనున్నట్లు తెలిపారు.