మాకు న్యాయం చేయాలి | Wife Protest With Children At Outside Husband House Seeking Justice In Ahmedguda, More Details Inside | Sakshi
Sakshi News home page

మాకు న్యాయం చేయాలి

Jan 12 2026 11:43 AM | Updated on Jan 12 2026 12:24 PM

Wife Protests with Children Outside Husband’s House Seeking Justice in Ahmedguda

హైదరాబాద్: న్యాయం కోసం పిల్లలతో కలిసి భర్త ఇంటి వద్ద భార్య నిరసన వ్యక్తం చేసింది. ఈ సంఘటన దమ్మాయిగూడ డివిజన్‌ పరిధిలోని అహ్మద్‌గూడలో చోటుచేసుకుంది.  సాయిచరణ్‌ అనే వ్యక్తి ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. భార్య శిల్ప, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యభర్తల మద్య పలుమార్లు గొడవలు జరిగేవి. దీంతో 2020 సంవత్సరం నుండి దూరంగా ఉంటున్నారు. అప్పటినుండి సాయిచరణ్‌ కనిపించకుండా తిరుగుతుండేవాడు. 

 సాయిచరణ్‌ కీసర అహ్మద్‌గూడలోని హిడెన్‌ గార్డెన్‌ అపార్టుమెంట్‌లో ఉంటున్నాడని తెలుసుకొని పిల్లలతో కలిసి భార్య శిల్ప  తమకు న్యాయం చేయాలని నిరసనకు దిగింది. అనంతరం కీసర పోలీసులు వచ్చి ఆమెతో చర్చలు జరిపారు, తనకు న్యాయం జరిగేంతవరకు అక్కడి నుండి కదిలేది లేదని భీష్మించుకుకూర్చుంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement