భార్యను గొంతుకోసి హత్య చేసిన భర్త | wife and husband incident in hyderabad | Sakshi
Sakshi News home page

భార్యను గొంతుకోసి హత్య చేసిన భర్త

Oct 13 2026 8:04 AM | Updated on Oct 13 2026 8:04 AM

హైదరాబాద్‌: భార్యపై అనుమానం పెంచుకు న్న భర్త గొంతుకోసి కి రాతకంగా ఆమెను హతమార్చిన సంఘటన రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. కోల్‌ కతాకు చెందిన ముస్తఫా 20 ఏళ్ల క్రితం వలస వచ్చి జల్‌పల్లి కమాన్‌ ఎదురుగా ఉన్న న్యూబాబానగర్‌ బస్తీలో ఉంటున్నాడు. ముస్తఫా కూలి పని చేస్తుండగా, భార్య అజ్మీరా బేగం (30) ఫంక్షన్‌హాళ్ల లో పనిచేస్తోంది. 

వీరికి ముగ్గురు కుమారులు. ఇటీవల ఆమె ఎవరితోనో ఫోన్‌ మాట్లాడుతుందంటూ భర్త అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై తరచూ గొడవలు సైతం జరుగుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం రాత్రి 7.30 గంటల సమయంలో అజ్మీరా ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయం చూసి ముస్తఫా కత్తితో గొంతుకోసి పరారయ్యాడు. అజ్మీరా తల్లిదండ్రులు పోలీ సులకు ఫిర్యాదు చేశారు.  కాగా, నిందితు డు పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయినట్లు సమాచారం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement