ఏసీబీ కోర్టులో ఓటుకు కోట్లు కేసు రేపటికి వాయిదా..  | Vote For Note Case Postponed To Friday By ACB Court | Sakshi
Sakshi News home page

ఏసీబీ కోర్టులో ఓటుకు కోట్లు కేసు రేపటికి వాయిదా.. 

Aug 12 2021 5:28 PM | Updated on Aug 12 2021 5:33 PM

Vote For Note Case Postponed To Friday By ACB Court - Sakshi

హైదరాబాద్‌: ఏసీబీ కోర్టులో ఓటుకు కోట్లు కేసు విచారణకు వచ్చింది. వేం నరేందర్‌రెడ్డి కుమారుడు కృష్ణ కీర్తన్‌రెడ్డి రేవంత్‌రెడ్డి మాజీ పీఏ సైదయ్య వాంగ్మూలం నమోదు చేశారు. తదుపరి విచారణ రేపటి(శుక్రవారం)కి వాయిదా వేశారు. కాగా తెలంగాణలో 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకు నోటు కేసు వెలుగులోకి వచ్చింది. ఎన్నికల్లో తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సిందిగా నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో టీడీపీ నేతలు బేరసారాలు సారించారనేది ఈ కేసులో ప్రధాన ఆరోపణ.

ఈ బేరసారాల్లో భాగంగా టీడీపీ నేత చంద్రబాబు మనవాళ్లు బ్రీఫ్‌డ్‌మీ అంటూ స్టీఫెన్‌సన్‌తో మాట్లాడినట్టు అభియోగాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి బయటికి వచ్చిన వీడియోలు అప్పట్లో సంచలనంగా మారాయి. ఈ కేసుకు సంబంధించి రేవంత్‌రెడ్డి కొద్ది రోజులు జైలులో ఉన్నారు. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల్లో రేవంత్‌రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement