వికారాబాద్: ఆరేళ్ల నాటి హత్య కేసులో వికారాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడు ప్రవీణ్‌కు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.
భార్య, పిల్లలను చంపిన కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధించింది కోర్టు. 2019లో భార్య, పిల్లల్ని ప్రవీణ్ అనే వ్యక్తి హత్య చేశాడు. ఆపై దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం చేశాడు. అయితే ఇన్నేళ్ల తర్వాత నేరం రుజువు కావడంతో ప్రవీణ్‌కు ఉరిశిక్షను ఖరారు చేసింది వికారాబాద్ జిల్లా కోర్టు.


