రెండేళ్ల చిన్నారిని బలిగొన్న సైనైడ్‌ | Two Year Old Girl Misha Incident | Sakshi
Sakshi News home page

రెండేళ్ల చిన్నారిని బలిగొన్న సైనైడ్‌

Oct 11 2026 8:26 AM | Updated on Oct 11 2026 8:26 AM

Two Year Old Girl Misha Incident

హైదరాబాద్‌: బంగారు నగల తయారీలో వినియోగించే సైనైడ్‌ను రెండేళ్ల చిన్నారి చేతితో ముట్టుకుని.. వేళ్లను నోటిలో పెట్టుకోవడంతో అస్వస్థకు గురై మృతి చెందిన ఘటన జీడిమెట్ల పీఎస్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఇన్‌స్పెక్టర్‌ కె.రవికుమార్‌ వివరాల ప్రకారం.. చింతల్‌ శ్రీనివాస్‌ నగర్‌కు చెందిన గోపి, జానకి దంపతుల కూతురు నిషా (2)తో కలిసి ఈ నెల 7న స్థానికంగా ఉన్న విష్ణు జ్యువెలర్స్‌ దుకాణానికి వెళ్లారు. అక్కడ సైనైడ్‌ను నిషా చేతితో పట్టుకుంది. 

ఆ తర్వాత వేళ్లను నోటిలో పెట్టుకున్న దృశ్యాలు దుకాణంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇంటికి వెళ్లిన తర్వాత నిషా అపస్మారక స్థితికి చేరుకోవడంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మృతి చెందింది. బాలిక మృతికి జ్యువెలరీ షాప్‌ యాజమాన్యమే కారణమంటూ బంధువులు ఆందోళనకు దిగారు. షాపు యాజమాన్యం స్పందించకపోవడంతో చిన్నారి తల్లిదండ్రులు శనివారం జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement