తెలంగాణ గ్రూప్‌-1 నోటిఫికేషన్‌కు లైన్‌క్లియర్‌

TSPSC Withdraw Case In Supreme Court Line Clear For Group 1 Exam - Sakshi

గ్రూప్ 1 నోటిఫికేషన్‌పై కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణలో గ్రూప్ 1 నోటిఫికేషన్‌కు లైన్‌ క్లియర్‌ అయ్యింది. గతంలో టీఎస్‌పీఎస్సీ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. దీంతో త్వరలో కొత్త గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల అయ్యే అవకాశం ఉంది.

కాగా రెండేళ్ల కిందట తొలిసారి నిర్వహించిన గ్రూప్‌ 1 పరీక్ష పేపర్‌ లీక్‌ కావడంతో ఆ పరీక్షను రద్దు చేశారు. రెండోసారి నిర్వహించిన పరీక్షలో కొందరి బయోమెట్రిక్ హాజరు తీసుకోలేదని కేసు వేయడంతో హైకోర్టు గ్రూప్‌-1 పరీక్షను రద్దు చేసింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ.. అప్పటి ప్రభుత్వం ఆదేశాల మేరకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్ కమిషన్ సుప్రీంకోర్టు కోర్టుకు వెళ్లింది. అయితే  తాజాగా గ్రూప్ 1పై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంది.

ఇక గతంలోని 503 ఖాళీలకు అదనంగా మరో 60 పోస్టులను పెంచుతూ ఇటీవల ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 563కి చేరుకుంది. ఈ పోస్టుల భర్తీకి అనుబంధ నోటిఫికేషన్ విడుదల కానుంది. గతంలో 503 పోస్టుల భర్తీకి TSPSC నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా గ్రూప్ 1 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు వయోపరిమితిని 46 ఏళ్ల వరకు సడలిస్తామని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. దీంతో వీలైనంత త్వరగా నోటిఫికేషన్ విడుదల కానుంది.

whatsapp channel

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top