నెలాఖరుకల్లా గురుకుల సెట్‌ ఫలితాలు! | Sakshi
Sakshi News home page

నెలాఖరుకల్లా గురుకుల సెట్‌ ఫలితాలు!

Published Mon, Jun 13 2022 1:31 AM

TS Gurukul CET Result 2022 Likely To Release Month End Of June - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో ప్రవేశాలకు అర్హత పరీక్షలు నిర్వహించిన గురుకుల సొసైటీలు ఇప్పుడు ఫలితాల ప్రకటన, అడ్మిషన్ల షెడ్యూల్‌ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఐదోతరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హత పరీక్షలు దాదాపు పూర్తయ్యాయి. ఒకట్రెండు సొసైటీల్లో బ్యాక్‌లాగ్‌ ఖాళీల భర్తీకి నాలుగైదు రోజుల్లో పరీక్ష పూర్తికానుంది.

ఈ నేపథ్యంలో ఈ నెలాఖరుకల్లా అన్నిరకాల ప్రవేశపరీక్షల ఫలితాలు ప్రకటించేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. ఫలితాల ప్రకటన తర్వాత వెంటనే అడ్మిషన్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నాయి. జూలై నెలాఖరుకు ప్రవేశాల ప్రక్రియను కొలిక్కి తెచ్చి, అవసరమున్న కేటగిరీల్లో రెండు, మూడోవిడత కౌన్సెలింగ్‌ నిర్వహించి పూర్తిస్థాయిలో సీట్లు భర్తీ చేసేలా కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నాయి. 

Advertisement
 
Advertisement