Telangana: కొత్తగా 205 మందికి కరోనా  | Telangana Records 205 New Covid Cases | Sakshi
Sakshi News home page

Telangana: కొత్తగా 205 మందికి కరోనా 

Dec 9 2021 3:56 AM | Updated on Dec 9 2021 9:35 AM

Telangana Records 205 New Covid Cases - Sakshi

తెలంగాణలో బుధవారం 38,085 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 205 మందికి పాజిటివ్‌ వచ్చింది.

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో బుధవారం 38,085 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 205 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు. ఈమేరకు ఆయన కరోనా బులెటిన్‌ విడుదల చేశారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,77,546కి చేరిందని వెల్లడించారు. ఒక రోజులో ఒకరు చనిపోగా, ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,002కు పెరిగిందన్నారు.

తాజాగా 185 మంది కరోనా నుంచి కోలుకోగా, మొత్తం కోలుకున్నవారి సంఖ్య 6,69, 673కి చేరిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఐసోలేషన్‌లో, ఆస్పత్రుల్లో 3,871 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఒకరోజులో నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 79 రికార్డయ్యాయన్నారు. కాగా, ఒమిక్రాన్‌ వేరి యంట్‌ ఉన్న రిస్క్‌ దేశాల నుంచి బుధవారం 345 మంది ప్రయాణికులు హైదరాబాద్‌ విమానాశ్రయంలో దిగారు. వారికి పరీక్షలు నిర్వహించగా, ఎవరికీ కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాలేదన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement