విద్యార్థుల ప్రవర్తనపై ప్రోగ్రెస్‌ కార్డు ఇద్దాం.. మంత్రి సత్యవతి సూచన | Telangana Minister Satyavathi Rathod Comments On Progress Card | Sakshi
Sakshi News home page

విద్యార్థుల ప్రవర్తనపై ప్రోగ్రెస్‌ కార్డు ఇద్దాం.. మంత్రి సత్యవతి రాథోడ్‌ సూచన

Jun 11 2022 12:56 AM | Updated on Jun 11 2022 3:09 PM

Telangana Minister Satyavathi Rathod Comments On Progress Card - Sakshi

వచ్చే వారం నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కా నుండటంతో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు, జిల్లా సంక్షేమాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి మాట్లాడు తూ.. గ్రామీణ విద్యార్థులపై ప్రత్యేక

సాక్షి, హైదరాబాద్‌: విద్యార్థుల చదువుపైనే కాకుండా వారి ప్రవర్తన పట్ల కూడా ప్రోగ్రెస్ర్‌ కార్డు ఇవ్వాలని మంత్రి సత్యవతి రాథోడ్‌ అధికారులను సూచించారు. ఈ దిశగా కార్యాచరణ రూపొందిం చాలని అధికారులకు ఆదేశించారు. వచ్చే వారం నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కా నుండటంతో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు, జిల్లా సంక్షేమాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి సత్యవతి మాట్లాడు తూ.. గ్రామీణ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారిం చాలని సూచించారు. సంక్షేమ వసతిగృహాల్లో చేరి కలు పెరిగేలా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అలాగే.. ‘గిరి వికాసం’ కింద గ్రామీ ణరోడ్లు, ట్రాన్స్‌పోర్టేషన్‌ ప్రోగ్రామ్, ట్రైకార్‌ క్రింద చేపట్టిన అన్ని పథకాలను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. గిరిజన గూడేల్లో, తండాల్లో జీసీసీతో సరుకులు సరఫరా సక్రమంగా అయ్యేలా చూడాల న్నారు. గిరిజన ఆవాసాల్లో ఇంకా ఎక్కడైనా త్రీఫేజ్‌ విద్యుదీకరణ పనులు అవసరమైతే విద్యుత్‌ శాఖ సహకారంతో త్వరగా పూర్తి చేయాలన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement