వలస పక్షులొచ్చాయి..

Telangana Minister Harish Rao Comments On Amit Shah - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర మంత్రి అమిత్‌ షా రాష్ట్ర పర్యటనతో పాటు తుక్కుగూడ సభలో చేసిన వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ నేతలు ట్విట్టర్‌లో విరుచుకుపడ్డారు. ‘వలస పక్షులు తమకు ఇష్టమైన ప్రాంతాలకు వెళ్లి కడుపునిండా తిని, గుడ్లు పెట్టి సంతోషంగా ఎగిరిపోతాయి. ప్రపంచ వలస పక్షుల దినోత్సవం, అమిత్‌ షా పర్యటన ఒకే రోజు కావడం కాకతాళీయం’అని మంత్రి హరీశ్‌ రావు వ్యాఖ్యానించారు. 

‘తెలంగాణకు ఏం ఇస్తావో చెప్పకుండా అక్బర్, బాబర్‌ అంటూ ఔట్‌ డేటెడ్‌ కూతలెందుకు? విభజన చట్టం హామీలపై మంత్రి కేటీఆర్‌ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా తోక ముడిచినపుడే నువ్వేంటో అర్థమైంది’ అని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ మండిపడ్డారు. ‘సమాధానం చెప్పమంటే సంబంధాలు లేని ముచ్చట్లు చెబుతున్న అమిత్‌ షా తోక ముడిచి పచ్చి అబద్ధాలు చెప్తున్నవు, పిచ్చి ఒర్రుడు కాదు. తెలంగాణకు బీజేపీ ఏం చేసిందో చెప్పు’ అని ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు ప్రశ్నించారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top