తెలంగాణలో అక్టోబర్‌ 25 నుంచి ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలు

Telangana: Inter First Year Exams Will Be Held From October 25 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అక్టోబ‌ర్ 25 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ పరీక్షలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలంగాణ ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు శుక్ర‌వారం ప్ర‌క‌టించింది. 2020-21 విద్యాసంవ‌త్స‌రానికి చెందిన ఫ‌స్టియ‌ర్ విద్యార్థుల‌కు (ప్ర‌స్తుతం సెకండియ‌ర్‌లో ఉన్న విద్యార్థులు) ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఉద‌యం 9 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు పరీక్షలు నిర్వ‌హించ‌నున్నారు. 70 శాతం సిల‌బ‌స్ నుంచే ఎగ్జామ్స్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఇంట‌ర్ బోర్డు అధికారులు స్ప‌ష్టం చేశారు. వ్యాక్సిన్ తీసుకున్న సిబ్బందినే విధుల్లోకి తీసుకుంటామ‌ని తెలిపారు. ప్ర‌తి ఎగ్జామ్ సెంట‌ర్‌లో ఒక‌టి, రెండు ఐసోలేష‌న్ సెంట‌ర్లు ఏర్పాటు చేస్తామని,  ఏఎన్ఎం లేదా స్టాఫ్ న‌ర్సు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.
చదవండి: సివిల్స్‌-2020 ఫలితాలు విడుదల 

పరీక్షల షెడ్యూల్‌
►  అక్టోబర్ 25న సెకండ్‌ లాంగ్వేజ్

►అక్టోబర్‌ 26న: ఇంగ్లీష్ పేపర్ 1

►అక్టోబర్‌ 27న: మాథ్స్ పేపర్1a,బొటనీ పేపర్1, పొలిటికల్ సైన్స్ 1

►అక్టోబర్‌ 28న: మాథ్స్‌ పేపవర్‌ 1బీ, జూవాలజీ పేపర్‌ 1, హిస్టరీ పేపర్‌ 1

►అక్టోబర్‌ 29న:  ఫిజిక్స్ పేపర్1,  ఎకనమిక్స్ పేపర్1 

►అక్టోబర్‌ 30 న: కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1

► న‌వంబ‌ర్ 1న ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్,

►2న మోడ్ర‌న్ లాంగ్వేజ్, జియోగ్ర‌ఫీ పేప‌ర్ల‌కు పరీక్షలు నిర్వ‌హించ‌నున్నారు.

కాగా కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా ఈ ఏడాది విద్యాశాఖ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు నిర్వహించని విషయం తెలిసిందే. నేరుగా సెకండ్ ఇయర్‌కు విద్యార్థులను ప్రమోట్ చేసింది. అయితే ప్రమోట్‌ అయిన విద్యార్థులకు మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. కరోనా పరిస్థితులు మళ్ళీ తలెత్తితే సెకండ్ ఇయర్‌లో మార్కులు కేటాయించడంపై ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రస్తుతం వారికి పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top