తెలంగాణ అసెంబ్లీ.. ఐదవరోజు సమావేశాలు ప్రారంభం | Sakshi
Sakshi News home page

తెలంగాణ అసెంబ్లీ.. ఐదవరోజు సమావేశాలు ప్రారంభం

Published Sat, Mar 12 2022 10:19 AM

Telangana Budget Session 2022: Day 5 Session Update - Sakshi

సాక్షి, హైద‌రాబాద్: తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. బడ్జెట్‌ సెషన్‌ 2022-23లో భాగంగా.. శనివారం ఉదయం ఐదవ రోజు సభను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. 

చేప‌ల పెంప‌కానికి ప్రోత్సాహం, హైద‌రాబాద్ న‌గ‌రంలో వ్యూహాత్మ‌క నాలాల అభివృద్ధి కార్య‌క్ర‌మం, నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమం, జీహెచ్ఎంసీ, ఇత‌ర జిల్లాల్లో ఆర్టీసీ బ‌స్సుల సౌక‌ర్యం, రాష్ట్రంలో నేత కార్మికుల సంక్షేమం, ఓఆర్ఆర్ వెలుప‌ల ఆవాసాల‌కు తాగునీరు, జ‌ర్న‌లిస్టుల సంక్షేమంతో పాటు అంశాల‌పై ప్ర‌శ్నోత్త‌రాలు కొన‌సాగ‌నున్నాయి. ప్ర‌శ్నోత్తరాలు ముగిసిన అనంత‌రం బ‌డ్జెట్ ప‌ద్దుల‌పై చ‌ర్చించ‌నున్నారు.

అనంతరం సభలో రెండు బిల్స్ తో పాటు  6 పద్దులు చర్చకు రానున్నాయి. సాంకేతిక విద్య ,పర్యాటకం , మెడికల్ అండ్ హెల్త్ , మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ ,లేబర్ ఎంప్లాయిమెంట్ , అడవుల అభివృద్ధి పై సభలో చర్చ జరగనుంది. సభలో ప్రశ్నలే అడగాలని, ప్రసంగాలు వద్దంటూ ఎమ్మెల్యేలకు డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌ సూచించడం విశేషం.

Advertisement
 
Advertisement
 
Advertisement