యూకే స్ట్రెయిన్‌: ఇక ఐసోలేషన్‌.. డబుల్‌!

Telangana 14 Days Isolation For UK Covid 19 Mutant Virus Victims - Sakshi

సాధారణ కరోనాకు 7.. బ్రిటన్‌ స్ట్రెయిన్‌కు 14 రోజులు

ఐసోలేషన్‌ కాలాన్నినిర్ధారించిన వైద్య, ఆరోగ్య శాఖ

ఆస్పత్రుల్లో యూకే వైరస్‌ బాధితులకు ప్రత్యేక వార్డు

ప్రత్యేకంగా 12 ఆసుపత్రుల్లో చికిత్సకు ఏర్పాట్లు

బ్రిటన్‌ వైరస్‌ విస్తరించకుండా జాగ్రత్తలకు ఆదేశాలు

కార్యాచరణ ప్రణాళిక రూపొందించిన యంత్రాంగం 

సాక్షి, హైదరాబాద్‌: సాధారణ కరోనా వైరస్‌ సోకినవారు 7 రోజులు ఐసోలేషన్‌లో ఉండాలని, బ్రిటన్‌ స్ట్రెయిన్‌ కరోనా వైరస్‌కు 14 రోజులు ఐసోలేషన్‌ తప్పనిసరని వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. సాధారణ వైరస్‌ నుంచి కోలుకున్నవారికి ప్రస్తుతం 7 రోజులు దాటాక లక్షణాలు ఏమీ లేకుంటే ఎలాంటి టెస్టులు చేయకుండానే సాధారణ వ్యక్తులుగా పరిగణిస్తున్నారు. వారి ఐసోలేషన్‌ కాలం పూర్తయినట్లుగా గుర్తిస్తున్నారు. అయితే బ్రిటన్‌ స్ట్రెయిన్‌ విషయంలో 14 రోజులపాటు ఐసోలేషన్‌లో ఉంచాక వారికి మరోసారి కరోనా పరీక్ష చేస్తారు. అందులో నెగటివ్‌ వచ్చాకే బాధితులను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేస్తారు. పాజిటివ్‌ వస్తే మరికొన్ని రోజులు ఉంచుతారు. ఇక బ్రిటన్‌ స్ట్రెయిన్‌ కరోనా వచ్చిన వారిని తప్పనిసరిగా ఆసుపత్రిలోనే ఉంచి వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతారు. హోం ఐసోలేషన్‌కు అనుమతివ్వరు.

అయితే ప్రస్తుత సాధారణ కరోనా వైరస్‌ మాదిరిగానే బ్రిటన్‌ వైరస్‌ సోకినవారికి చికిత్స చేస్తారు. బ్రిటన్‌ వైరస్‌కు ప్రత్యేక వైద్యం లేదని వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. అలాగే సాధారణ కరోనా వైరస్‌ వార్డుల్లో బ్రిటన్‌ వైరస్‌ బాధితులను ఉంచకూడదని నిర్ణయించారు. బ్రిటన్‌ వైరస్‌ సాధారణ వైరస్‌ రోగులకు వ్యాపించే ప్రమాదం ఉందని ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికోసం రాష్ట్రంలో 12 ఆసుపత్రులను బ్రిటన్‌ నుంచి వచ్చిన కరోనా బాధితులకు కేటాయించాలని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ప్రతీ ఉమ్మడి జిల్లా కేంద్రంలో ఒకటి, మిగిలినవి హైదరాబాద్‌లో ఆయా ఆసుపత్రులను అందుబాటులో ఉంచుతారు. ఉదాహరణకు ప్రస్తుతం బ్రిటన్‌ నుంచి వచ్చిన కరోనా పాజిటివ్‌ బాధితుల్లో 14 మందిని హైదరాబాద్‌ టిమ్స్‌లో ఉంచారు. మిగిలిన వారిని వివిధ జిల్లాల్లో ఉంచారు. టిమ్స్‌లో బ్రిటన్‌ నుంచి వచ్చిన కరోనా బాధితుల కోసం మూడు ఫ్లోర్లు సిద్ధం చేశారు. (చదవండి: కొత్త వైరస్‌కూ పాత జాగ్రత్తలే )

పోలీస్, రెవెన్యూల సహకారం...  
బ్రిటన్‌ నుంచి వచ్చే వారి వివరాలను ఎప్పటికప్పుడు గుర్తించేందుకు పోలీసు, రెవెన్యూ సహా ఇతర శాఖల సహకారం తీసుకోవాలని వైద్య, ఆరోగ్యశాఖ కార్యాచరణ ప్రణాళికలో పేర్కొంది. కరోనా వైరస్‌ వచ్చిన మొదట్లో ఎలాంటి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారో ఇప్పుడు కూడా బ్రిటన్‌ వైరస్‌ పట్ల అలాగే వ్యవహరించాలని నిర్ణయించింది. బ్రిటన్‌ స్ట్రెయిన్‌ వచ్చిన బాధితులు ఎవరెవరిని కలిశారో వారి మొదటి, రెండు, మూడు కాంట్రాక్టు వ్యక్తులను గుర్తిస్తారు. ఒకవేళ కేసులు పెరిగితే మొదట్లో మాదిరిగానే కంటైన్మెంట్‌ జోన్లను ఏర్పాటు చేసే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. వైరస్‌కు వేగంగా విస్తరించే గుణం ఉన్నందున అంతే వేగంగా బాధితులను గుర్తించాల్సి ఉందని కార్యాచరణ ప్రణాళికలో వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.  

ఆర్టీపీసీఆర్‌లో చిక్కని బ్రిటన్‌ స్ట్రెయిన్‌... 
బ్రిటన్‌ వైరస్‌ ప్రస్తుత సాధారణ పరీక్షల్లో కనుగొనే వీలే లేదని తేలిపోయింది. ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు సాధారణ కరోనాను నిర్ధారించడానికే పరిమితమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. బ్రిటన్‌ స్ట్రెయిన్‌ ఉందా.. లేదా.. తెలుసుకోవాలంటే ముందుగా వారిలో సాధారణ కరోనా వైరస్‌ ఉందా.. లేదా.. తెలుసుకునేందుకు ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేస్తారు. అందులో పాజిటివ్‌ వస్తే బ్రిటన్‌ స్ట్రెయిన్‌ వైరస్‌ ఉందో.. లేదో.. తెలుసుకునేందుకు సీసీఎంబీ వంటి ప్రతిష్టాత్మక పరిశోధనాత్మక సంస్థల్లో జీనోమ్‌ సీక్వెన్సీ (జన్యు విశ్లేషణ) చేయాల్సిందేనని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.

ఒకవేళ బ్రిటన్‌ స్ట్రెయిన్‌ వైరస్‌ విస్తరిస్తే దాన్ని గుర్తించేందుకు రాష్ట్రంలో నిమ్స్‌లో జీనోమ్‌ సీక్వెన్సీ టెస్టింగ్‌ మెషీన్‌ను నెలకొల్పాలని భావిస్తున్నారు. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. బ్రిటన్‌ స్ట్రెయిన్‌ కరోనా వైరస్‌ను గుర్తించాలంటే జీనోమ్‌ సీక్వెన్సీతోపాటు ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌ కిట్లలో మార్పులు చేయాల్సి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. బ్రిటన్‌ స్ట్రెయిన్‌ కరోనా వైరస్‌ విస్తరించకుండా జిల్లాల్లో అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ జిల్లాల అధికారులను ఆదేశించింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

08-05-2021
May 08, 2021, 01:22 IST
రంగారెడ్డి జిల్లా యాచారానికి చెందిన ఎం.కృష్ణయ్య రెండ్రోజులుగా తీవ్ర జ్వరం, తలనొప్పితో బాధపడుతూ శుక్రవారం స్థానిక పీహెచ్‌సీలో కరోనా నిర్ధారణ...
08-05-2021
May 08, 2021, 01:21 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌–19 కేసులు పెరగడానికి 5జీ స్పెక్ట్రమ్‌ ట్రయల్సే కారణమంటూ వస్తున్న వదంతులపై టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ ఆందోళన...
08-05-2021
May 08, 2021, 00:43 IST
సాక్షి, కాజీపేట అర్బన్‌: కోవిడ్‌–19పై వరంగల్‌ అర్బన్‌ జిల్లా కాజీపేటలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌)లో చేపట్టిన పరిశోధనలు ఏడాది...
08-05-2021
May 08, 2021, 00:42 IST
మనకు జన్మతః తల్లితండ్రులు, బంధువులు ఉంటారు. పెరిగే కొద్ది స్నేహితులూ ఉంటారు. కాని మనింట్లో ఒక రేడియో సెట్‌ ఉంటే...
07-05-2021
May 07, 2021, 21:58 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌ వైద్యానికి మరో కీలక జీవోను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో 50శాతం బెడ్లను కోవిడ్‌...
07-05-2021
May 07, 2021, 20:57 IST
రెండో దశలో కరోనా మహమ్మారి విజృంభిస్తోందని , థర్డ్‌ వేవ్‌ను  తప్పదంటూ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన  కేంద్ర ప్రభుత్వ అత్యున్నత...
07-05-2021
May 07, 2021, 20:51 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో వైర‌స్ వ్యాప్తి కొన‌సాగుతుంది. గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్రంలో కొత్తగా 5,559 కరోనా కేసులు న‌మోద‌య్యాయి. 41...
07-05-2021
May 07, 2021, 20:40 IST
అమరావతి: ఏపీలోని ఆస్పత్రుల్లో విజిలెన్స్‌ దాడులు కొనసాగుతున్నాయి.అక్రమాలకు పాల్పడుతున్న నాలుగు ఆస్పత్రులపై అధికారులు కేసులు నమోదు చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ...
07-05-2021
May 07, 2021, 19:32 IST
సాక్షి, అమరావతి : గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 1,00,424 కరోనా పరీక్షలు నిర్వహించగా 17,188 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది....
07-05-2021
May 07, 2021, 19:01 IST
సాక్షి,న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ సోకిన తరువాత కోలుకోవడం ఒక ఎత్తయితే.. కోలుకున్న తరువాత మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం మరో ఎత్తు....
07-05-2021
May 07, 2021, 18:51 IST
గురజాల: గుంటూరు జిల్లా గురజాల మండలం మాడుగుల పీహెచ్‌సీలో పనిచేస్తోన్న డాక్టర్‌ జి.పద్మావతి కోవిడ్‌ వారియర్‌గా కరోనా రోగులకు నిర్విరామ...
07-05-2021
May 07, 2021, 17:48 IST
సాక్షి, విజయవాడ: దేశ వ్యాప్తంగా జనవరి 16న వ్యాక్సినేషన్ పక్రియను కేంద్రం ప్రారంభించిందని.. వ్యాక్సినేషన్‌ విషయంలో మనం ఆదర్శంగా నిలిచామని ఏపీ వైద్యారోగ్య...
07-05-2021
May 07, 2021, 17:46 IST
న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. మ‌హ‌మ్మారి క‌ట్ట‌డి కోసం ప‌లు రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించ‌డంతో పాటు.. అంత‌రాష్ట్ర ప్ర‌యాణాల‌పై...
07-05-2021
May 07, 2021, 17:15 IST
సాక్షి, అమరావతి: కరోనా విపత్కర పరిస్థితుల్లో పేదలకు ఆరోగ్యశ్రీ సంజీవనిలా పనిచేస్తోంది. ఆరోగ్యశ్రీ పథకంతో రాష్ట్రంలోని పేద ప్రజలకు ఉచితంగా...
07-05-2021
May 07, 2021, 16:51 IST
ఢిల్లీ: ప్ర‌పంచాన్ని బెంబెలేత్తించిన క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డి కోసం చాలా దేశాలు వ్యాక్సిన్ల‌ను అభివృద్ధి చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. మ‌న...
07-05-2021
May 07, 2021, 16:36 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌ కట్టడే లక్ష్యంగా రాష్ట్రంలో  కర్ఫ్యూ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. ప్రజలు కూడా స్వచ్ఛందంగా కర్ఫ్యూలో పాల్గొంటున్నారు. ఉద్యోగుల...
07-05-2021
May 07, 2021, 15:40 IST
ఢిల్లీ: రాష్ట్రాల వారీగా రెమిడెసివిర్‌ ఇంజక్షన్లను శుక్రవారం కేంద్రం కేటాయించింది. ఈ నెల 16 వరకు కేటాయింపులు చేస్తూ కేంద్రం...
07-05-2021
May 07, 2021, 15:01 IST
శివాజీనగర/యశవంతపుర: ‘అయ్యా నా భర్తను కాపాడండి.. కరోనాతో చనిపోయేలా ఉన్నాడు.. ఏదైనా ఆస్పత్రిలో బెడ్‌ ఇప్పించండి..’ అంటూ ఒక మహిళ...
07-05-2021
May 07, 2021, 14:14 IST
ఆర్థికంగా లెక్కలు వేసుకుంటూ కూర్చుంటే మహా విషాదకర సంక్షోభంలోకి దేశం వెళ్తుంది
07-05-2021
May 07, 2021, 13:42 IST
ఎన్‌440కే అంత ప్రమాదం కాదని శాస్త్రవేత్తలే చెబుతున్నారు. కేరళ లాంటి రాష్ట్రాల్లో ఎన్‌440కే స్ట్రెయిన్‌.. చాలా రోజుల నుంచే ఉందని...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top