వరుసగా గ్రూప్‌–1 పరీక్షలా!

Students Concern On TSPSC Group 1 Main Exam Dates - Sakshi

అభ్యర్థుల్లో ఆందోళన.. రోజువిడిచి రోజు నిర్వహించాలని డిమాండ్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) గ్రూప్‌–1 మెయిన్‌ (ప్రధాన) పరీక్షల తేదీ­లపై అభ్యర్థు ల్లో ఆందోళన పెరుగుతోంది. వరుసగా పరీక్ష లు ఉండటం అభ్యర్థులపై ఒత్తిడి పెరుగు తుందనే అభిప్రాయం వ్యక్తమ­వుతోంది. అందువల్ల పరీక్ష తేదీల్లో మార్పు­లు చేయాలని, కనీసం రోజువిడిచి రోజు పరీక్షలు ఉండేలా షెడ్యూల్‌ రూపొందించాలనే డిమాండ్‌ పెరు గుతోంది.

గ్రూప్‌–1 మెయిన్‌ కేటగిరీలో ఏడు పరీక్షలున్నాయి. జనరల్‌ ఇంగ్లిష్‌ క్వాలి ఫైయింగ్‌ పరీక్ష కాగా, మిగతా 6 పేపర్లు ప్రధానపరీక్షలు. ఒక్కో పరీక్షకు గరి ష్టంగా 150 మార్కులు లెక్కన మొత్తం 1,050 మార్కులుంటాయి. ఈ ఏడింటిలో ఒకటి మినహా మిగతా ఆరు పరీక్ష లను జూన్‌ 5 నుంచి 12 వరకు (11వ తేదీ మినహా)  నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

ఏపీపీఎస్సీలో అలా...
ఉమ్మడి రాష్ట్రంలో ఏపీపీఎస్సీ మెయిన్‌ పరీక్షల తేదీలను ఒక్కో పరీక్షకు ఒక రోజు అంతరం ఉండేలా షెడ్యూల్‌ను రూపొందించి నిర్వహించింది. 2012లో గ్రూప్‌–1 మెయిన్‌ పరీక్షలను సెప్టెంబర్‌ 18, 20, 22, 24, 26, 28 తేదీల్లో చేపట్టింది. అలాగే విభజన తర్వాత ఏపీపీఎస్సీ పరిధిలో 2016లో జరిగిన మెయిన్‌ పరీక్షల్లో జనరల్‌ ఇంగీŠల్ష్‌ పరీక్ష సెప్టెంబర్‌ 13న నిర్వహించగా సెప్టెంబర్‌ 14, 17, 19, 21, 23 తేదీల్లో ఐదు పేపర్లకు సంబంధించిన పరీక్షలు జరిగాయి.

ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరి...
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రభుత్వం తొలిసారి గ్రూప్‌–1 ఉద్యోగాల భర్తీ చేపట్టడం... 503 ఉద్యోగ ఖాళీలు ఉండటంతో అభ్యర్థులు పట్టుదలతో సిద్ధమవు­తున్నారు. అయితే పరీక్షలను వరుసగా నిర్వహిస్తే అభ్యర్థులు మానసిక ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉందని, వారి ఏకాగ్రత దెబ్బతినే అవకాశం ఉందని సైకియాట్రిస్ట్‌లు చెబుతున్నారు.

గత విధానాన్ని అనుసరించాలి..
పరీక్షలను వరుసగా కాకుండా రోజువిడిచి రోజు నిర్వహిస్తే అభ్యర్థులకు ఉపశమనం లభిస్తుంది. అలా కాకుండా వరుసగా నిర్వహిస్తే ఒత్తిడికి గురై పరీక్షలను పక్కాగా రాయడంలో విఫలమయ్యే అవకాశం ఉంది. అందువల్ల ఉమ్మడి ఏపీలో నిర్వహించిన పరీక్షల విధానాన్ని టీఎస్‌పీఎస్సీ పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి.    
– ఏఏస్‌ నారాయణ, గ్రూప్‌–1 మెయిన్స్‌ అభ్యర్థి  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top