తండ్రి దహన సంస్కారాలు..అడ్డుకున్న కొడుకు అప్పులోళ్లు | Creditors Stopped Father Last Rites In Metpally - Sakshi
Sakshi News home page

తండ్రి దహన సంస్కారాలు..అడ్డుకున్న కొడుకు అప్పులోళ్లు

Published Sun, Dec 17 2023 3:58 PM

Son Creditors Stopped Father Last Rites In Metpally - Sakshi

సాక్షి,జగిత్యాల జిల్లా: కొడుకు అప్పుకట్టలేదని తండ్రి దహన సంస్కారాన్ని అప్పులోళ్లు అడ్డుకున్నారు. ఈ ఘటన మెట్ పల్లి పట్టణంలోని చైతన్య నగర్‌లో జరిగింది.  కొంతకాలం‌ నుంచి పలువురి వద్ద 1 కోటి 70 లక్షల రూపాయల దాకా పుల్లూరి శ్రీకాంత్‌ అనే వ్యక్తి అప్పు చేశాడు. అప్పు చెల్లించలేక శ్రీకాంత్‌ హైదరాబాద్‌ పారిపోయాడు.‍ శ్రీకాంత్‌ తండ్రి పుల్లూరి నారాయణ శనివారం మృతి చెందాడు.

అయితే తండ్రి దహన సంస్కారాల కోసం శ్రీకాంత్‌ తన స్వస్థలం మెట్‌పల్లికి ఆదివారం వచ్చాడు. విషయం తెలుసుకున్న శ్రీకాంత్‌ అప్పులోళ్లు దహన సంస్కారాలు జరిగే చోటికి వచ్చారు. అప్పు తీర్చేవరకు తండ్రి శవానికి దహన సంస్కారాలు జరగనివ్వబోమని అడ్డుకున్నారు.

దీంతో దహన కార్యక్రమం గంట పాటు నిలిచిపోయింది. చివరకు ఆస్తి అమ్మి అప్పులు చెల్లిస్తానని శ్రీకాంత్‌ హామీ ఇవ్వడంతో అప్పుల వాళ్లు వెనుదిరిగారు. తర్వాత తండ్రి నారాయణ దహన సంస్కారాలు జరిగాయి. 

ఇదీచదవండి..గవర్నర్ ప్రసంగంలో అసలు విషయం ఇదేనా

Advertisement
 
Advertisement