
భువనగిరి జిల్లా వర్కట్‌పల్లి అల్లుడు
డీజీపీగా నియామకంపై హర్షం
నల్లగొండ: రాష్ట్ర నూతన డీజీపీగా నియమితులైన శివధర్‌రెడ్డి గతంలో పూర్వ నల్లగొండ జిల్లా ఎస్పీగా పనిచేశారు. 1994 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన శివధర్‌రెడ్డి నల్లగొండ ఎస్పీగా 2000 ఏప్రిల్ 1 నుంచి 2002 ఏప్రిల్ 15 వరకు పనిచేశారు. నక్సల్స్ కార్యకలాపాలను అరికట్టడంలో, గ్యాంగ్‌స్టర్‌లను అణచివేయడంలో ఆయనకు మంచి పేరుంది. శివధర్‌రెడ్డి స్వస్థలం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కాగా.. భువనగిరి జిల్లా వలిగొండ మండలం వర్కట్‌పల్లి ఆయన అత్తగారి ఊరు. శివధర్‌రెడ్డి.. టీఆర్‌ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, సీనియర్ నాయకుడు దివంగత కళ్లెం యాదగిరిరెడ్డి అల్లుడు.