‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు.. సిట్‌ రిపోర్ట్‌లో షాకింగ్‌ విషయాలు! | SIT Filed Counter In Court In TRS MLAs Purchase case SIT Report | Sakshi
Sakshi News home page

‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు.. సిట్‌ రిపోర్ట్‌లో షాకింగ్‌ విషయాలు!

Nov 30 2022 9:22 PM | Updated on Nov 30 2022 9:33 PM

SIT Filed Counter In Court In TRS MLAs Purchase case SIT Report - Sakshi

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కోర్టులో కౌంటర్‌ సమర్పించారు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) అధికారులు.

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో కోర్టులో కౌంటర్‌ సమర్పించారు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) అధికారులు. ఇప్పటి వరకు జాబితాలో లేని కీలక వ్యక్తుల కొత్త పేర్లను అందులో ప్రస్తావించారు. నిందితులతో అనుమానితుల ఫోన్‌కాల్‌ డేటాను కోర్టుకు సమర్పించారు. కీలక నేతలతో నిందితులు దిగిన ఫోటోలు, వారు ప్రయాణించిన విమాన టికెట్లను సేకరించింది సిట్‌. 

అంతకుముందు ఈ కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను డిసెంబర్‌ 6వ తేదీకి వాయిదా వేసింది. అయితే, కోర్టులో ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలన్న బీజేపీ పిటిషన్‌పై వాడివేడి వాదనలు జరిగాయి.

ఇదీ చదవండి: MLA Poaching Case: హైకోర్టులో హీటెక్కిన విచారణ.. ఏం జరిగిందంటే?

Advertisement
 
Advertisement
Advertisement