breaking news
new names emerge
-
‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు.. సిట్ రిపోర్ట్‌లో షాకింగ్ విషయాలు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో కోర్టులో కౌంటర్ సమర్పించారు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు. ఇప్పటి వరకు జాబితాలో లేని కీలక వ్యక్తుల కొత్త పేర్లను అందులో ప్రస్తావించారు. నిందితులతో అనుమానితుల ఫోన్‌కాల్ డేటాను కోర్టుకు సమర్పించారు. కీలక నేతలతో నిందితులు దిగిన ఫోటోలు, వారు ప్రయాణించిన విమాన టికెట్లను సేకరించింది సిట్. అంతకుముందు ఈ కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను డిసెంబర్ 6వ తేదీకి వాయిదా వేసింది. అయితే, కోర్టులో ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలన్న బీజేపీ పిటిషన్‌పై వాడివేడి వాదనలు జరిగాయి. ఇదీ చదవండి: MLA Poaching Case: హైకోర్టులో హీటెక్కిన విచారణ.. ఏం జరిగిందంటే? -
సిట్ జాబితాలోకి మరికొన్ని పేర్లు
న్యూఢిల్లీ: నల్లధనాన్ని వెలికితీసేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక విచారణ బృందం (సిట్) విస్తృతంగా దర్యాప్తు చేయనుంది. స్విస్ బ్యాంకుల్లో ఖాతా ఉన్న మరికొంతమంది భారతీయులను విచారణ జాబితాలోకి తీసుకువచ్చింది. ఇప్పటికే విచారణ ఎదుర్కొంటున్నవారితో పాటు కొత్తగా మరికొంతమందిని విచారించాలని సిట్ నిర్ణయించింది. అయితే అక్రమాలకు పాల్పడినట్టు రుజువయిన తర్వాతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిట్ స్పష్టం చేసింది. భారతీయ స్విస్ ఖాతాదారులను మరికొంతమందిని గుర్తించామని, విచారణ చేయనున్నట్టు సిట్ చైర్మన్ ఎంబీ షా చెప్పారు.