సింగరేణిలో విషాదం: రూఫ్‌ కూలి ఇద్దరు దుర్మరణం

Singareni Coal Mines: Two Workers Killed In 6th Mine - Sakshi

జయశంకర్ భూపాలపల్లి: సింగరేణి బొగ్గుగనుల్లో విషాదం ఏర్పడింది. పనులు చేస్తున్న సమయంలో బండ కూలడంతో ఇద్దరు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన జయశంకర్‌ భూపాలపల్లిలోలోని కాకతీయ 6వ బొగ్గు గనిలో జరిగింది. అయితే చీకటి పడడంతో వారికి సహాయక చర్యలు చేపట్టడానికి ఆలస్యమైంది. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రస్తుతం సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని తెలుస్తోంది. 

కాకతీయ 6వ బొగ్గు గనిలో 2వ షిఫ్ట్‌లో విధులు నిర్వహించేందుకు సపోర్ట్ మెయిన్ కార్మికులు శంకరయ్య నరసయ్య వచ్చారు. పనులు చేస్తున్న సమయంలో పై నుంచి ఒక్కసారిగా బండ (రూఫ్‌) కూలి వారిద్దరిపై పడింది. తీవ్ర గాయాలపాలయ్యారు. దీన్ని గుర్తించి వెంటనే తోటి కార్మికులు, అధికారులు స్పందించి వారిని బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సహాయక చర్యలు చేపడుతున్న సింగరేణి అధికారులు చేపట్టారు. చీకటి పడడంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి మృతదేహాలను లోపలి నుంచి బయటకు తీసుకొచ్చేందుకు సింగరేణి అధికారులు చర్యలు చేపట్టారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top