జేఎల్‌ఎం ప్రశ్నాపత్రం లీక్‌ కేసులో పోలీసుల దూకుడు.. పలువురి అరెస్ట్‌! | Several Arrested in TSSPDCL JLM Paper Leak Case | Sakshi
Sakshi News home page

JLM Paper Leak: జూనియర్‌ లైన్‌మెన్‌ ప్రశ్నాపత్రం లీక్‌ కేసులో పలువురు అరెస్ట్‌

Jul 26 2022 10:23 AM | Updated on Jul 26 2022 10:52 AM

Several Arrested in TSSPDCL JLM Paper Leak Case - Sakshi

తెలంగాణ విద్యుత్ శాఖ జూనియర్ లైన్ మెన్ ప్రశ్నాపత్రం లీక్ కేసు దర్యాప్తులో వేగం పెంచారు పోలీసులు.

హైదరాబాద్‌: తెలంగాణ విద్యుత్ శాఖ జూనియర్ లైన్ మెన్ ప్రశ్నాపత్రం లీక్ కేసు దర్యాప్తులో వేగం పెంచారు పోలీసులు. దర్యాప్తు చేపట్టేందుకు  టాస్క్‌ఫోర్స్‌, ఎస్వోటీ పోలీసులు రంగంలోకి దిగారు. ప్రశ్నాపత్రం లీక్‌ వెనుక విద్యుత్ శాఖ ఉద్యోగులే కీలక సూత్రదారులుగా గుర్తించారు. ఇప్పటికే.. ఏడీఈ ఫిరోజ్ ఖాన్, లైన్‌మెన్ శ్రీనివాస్‌లను అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు. హైదరాబాద్, రాచకొండలో నమోదైన కేసుల్లో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తున్నాయని తెలిపారు. 

ఒక్కో ఉద్యోగానికి రూ.5లక్షలు.. 
ఒక్కో ఉద్యోగానికి రూ.5 లక్షల చొప్పున ఒప్పందం చేసుకున్నారని పోలీసులు తెలిపారు. అడ్వాన్స్‌గా ఒక్కొక్కరి నుంచి నిందితులు లక్ష రూపాయలు వసూలు చేశారని వెల్లడించారు. పరీక్షల్లో మైక్రోఫోన్ సహాయంతో సమాధానాలు అభ్యర్థులకు చేరవేసినట్లు చెప్పారు. ఇప్పటికే పోలీసుల అదుపులో పలువురు నిందితులు, అభ్యర్థులు ఉండగా.. వారిని విచారిస్తున్నారు. అయితే.. కీలక నిందితులు పరారీలో ఉన్నట్లు సమాచారం.

ఇదీ చదవండి: నేరగాళ్లుకు కలిసోచ్చే వెబ్‌... పట్టు కోసం కసరత్తులు చేస్తున్న పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement