దసరా సెలవులను 9 రోజులకు కుదించాలి

SCERT Director Proposal To Govt Over Dussehra Holidays - Sakshi

ప్రభుత్వానికి ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ ప్రతిపాదనలు 

సాక్షి, హైదరాబాద్‌: విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా దసరా సెలవులను తగ్గించాలని రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి(స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యు కేషన్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌–ఎస్‌సీఈఆర్‌టీ) రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ మేరకు ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ రాధారెడ్డి మంగళవారం పాఠశాల విద్య డైరెక్టర్‌కు ఓ లేఖ రాశారు. జూలైలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఆ నెల 11 నుంచి 16 రోజులపాటు సెలవులు, ఈ నెల 17న జాతీయ సమైక్యతాదినోత్సవాన్ని పురస్కరించుకుని మరో సెలవు.. ఇలా అనుకోకుండా వచ్చిన సెలవుల వల్ల స్కూళ్లు మూతపడ్డాయని పేర్కొన్నారు.

2022–23 విద్యా క్యాలెండర్‌ ప్రకారం 230 రోజులు పాఠశా లల పనిదినాలుగా ఉండాలని, అనుకోకుండా ఇచ్చిన సెలవుల వల్ల విద్యార్థుల బోధనకు నష్టం జరిగే అవకాశముందని పాఠశాల డైరెక్టర్‌ దృష్టికి తెచ్చారు. ఈ కారణంగా ఈ నెల 26వ తేదీ నుంచి 14 రోజులపాటు ఇవ్వాల్సిన దసరా సెలవులను అక్టోబర్‌ 1 నుంచి 9 వరకూ ఇస్తే (9 రోజులు) సరి పోతుందని ప్రతిపాదించారు. వచ్చే నవంబర్, డిసెంబర్, 2023 ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌లో రెండో శనివారం కూడా పనిదినాలుగా చేయడం వల్ల మరో 5 రోజులు బోధనకు వీలుంటుందని సూచించారు. ఈ ప్రతిపాదనలపై సరైన నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top