breaking news
Dusara Holidays
-
దసరా సెలవులను 9 రోజులకు కుదించాలి
సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా దసరా సెలవులను తగ్గించాలని రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి(స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యు కేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్–ఎస్సీఈఆర్టీ) రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ మేరకు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి మంగళవారం పాఠశాల విద్య డైరెక్టర్‌కు ఓ లేఖ రాశారు. జూలైలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఆ నెల 11 నుంచి 16 రోజులపాటు సెలవులు, ఈ నెల 17న జాతీయ సమైక్యతాదినోత్సవాన్ని పురస్కరించుకుని మరో సెలవు.. ఇలా అనుకోకుండా వచ్చిన సెలవుల వల్ల స్కూళ్లు మూతపడ్డాయని పేర్కొన్నారు. 2022–23 విద్యా క్యాలెండర్ ప్రకారం 230 రోజులు పాఠశా లల పనిదినాలుగా ఉండాలని, అనుకోకుండా ఇచ్చిన సెలవుల వల్ల విద్యార్థుల బోధనకు నష్టం జరిగే అవకాశముందని పాఠశాల డైరెక్టర్ దృష్టికి తెచ్చారు. ఈ కారణంగా ఈ నెల 26వ తేదీ నుంచి 14 రోజులపాటు ఇవ్వాల్సిన దసరా సెలవులను అక్టోబర్ 1 నుంచి 9 వరకూ ఇస్తే (9 రోజులు) సరి పోతుందని ప్రతిపాదించారు. వచ్చే నవంబర్, డిసెంబర్, 2023 ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌లో రెండో శనివారం కూడా పనిదినాలుగా చేయడం వల్ల మరో 5 రోజులు బోధనకు వీలుంటుందని సూచించారు. ఈ ప్రతిపాదనలపై సరైన నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. -
నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలు నిర్వహిస్తే చర్యలు
– డీఈఓ బి. ప్రతాప్‌రెడ్డి కడప ఎడ్యుకేషన్: ప్రభుత్వ నిబంధనల మేరకు సెలవులు ప్రకటించిన తర్వాత కూడా పాఠశాలలను నిర్వహిస్తే చర్యలు తప్పవని డీఈఓ బండ్లపల్లె ప్రతాప్‌రెడ్డి పాఠశాలల యాజమాన్యానికి హెచ్చరించారు. దసరా సెలవులను ప్రకటించినా నగరంలోని పలు పాఠశాలలను శుక్రవారం కూడా నిర్వహించడంతో డీఈఓ ప్రతాప్‌రెడ్డితోపాటు కార్యాలయ సిబ్బంది దాడులు నిర్వహించారు. పాఠశాలలను నిర్వహించే పలు యాజమాన్యాలకు హెచ్చరించి పిల్లలను ఇళ్లకు పంపించి వేశారు. డీఈఓ మాట్లాడుతూ సెలవుల సమయంలో పాఠశాలల్లో పిల్లలకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యలన్నారు. ప్రైవేటు విద్యా సంస్థలు పాఠశాలలను నిర్వహిస్తే డిప్యూటీ ఈఓలతోపాటు ఆయా మండలాల ఎంఈఓలదే బాధ్యత అన్నారు. దాడుల్లో డీఈఓ తోపాటు ఆర్జేడీ, డీఈఓ కార్యాలయ సిబ్బంది రమేష్ బాబు, నాగరాజు, బాదుల్లా, తదితరులు పాల్గొన్నారు.