ప్రస్తుతం బంగారానికి ఉన్న ధర ఇవ్వాలి.. | sbi bank gold theft mulugu district | Sakshi
Sakshi News home page

ప్రస్తుతం బంగారానికి ఉన్న ధర ఇవ్వాలి..

May 27 2025 10:57 AM | Updated on May 27 2025 10:57 AM

sbi bank gold theft mulugu district

ప్రస్తుతం బంగారానికి ఉన్న ధర ఇవ్వాలి.. తక్కువ చెల్లించొద్దు 

బంగారం బాధితుల డిమాండ్‌

ఎస్‌బీఐ ఎదుట, జాతీయ రహదారిపై ఆందోళన

రాయపర్తి(ములుగు): బ్యాంకులో దాచుకున్న బంగారం చోరీకి గురైందని, ఈ విషయంలో బ్యాంకు అధికారులు డబ్బు చెల్లి స్తామని ఒప్పుకున్నారని, ఆ ప్రకారమే ప్రస్తుతం బంగారా నికి ఉన్న ధర చెల్లించాలని పలువురు ఖాతాదారులు డిమాండ్‌ చేశారు. తక్కువ ధర చెల్లిస్తే ఊరుకోబోమని స్పష్టం చేశా రు. ఈ మేరకు సోమవారం మండలకేంద్రంలోని ఎస్‌బీఐ ఎదుట, అనంతరం వరంగల్, ఖమ్మం జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. వరంగల్‌ జిల్లా రాయపర్తి మండలకేంద్రంలోని ఎస్‌బీఐలో గతేడాది నవంబర్‌ 18న బ్యాంకులో 495 మందికి చెందిన 19కిలోల బంగారం చోరీకి గురైన విషయం విధితమే. 

ఈఘటనలో పోలీసులు ఏడుగురు ముఠా సభ్యులను అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి 2 కిలోల 520 గ్రాముల బంగారం రికవరీ చేశారు. బాధితులు అధైర్యపడొద్దని, న్యా యం చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. గత నెలలో తులానికి రూ.95వేల చొప్పున ఇస్తామని చెప్పడంతో బాధితులు ఒప్పుకున్నారు. ఈ క్రమంలో 87 మంది పేర్లు ఉన్నతాధికారులకు పంపారు. అందులో కొంత మందికి రూ.92వేలు, మరి కొంతమందికి రూ.87వేలు పలు రకాలుగా రావడంతో తక్కువ వచ్చినవారు వద్దని, ఎక్కువ వచ్చినవారు లెక్క చూసుకుని వెళ్లారు. 

ఈ క్రమంలో రూ. 95వేలు ఒప్పుకున్న బ్యాంకు అధికారులు ప్రస్తుతం తక్కువ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ బ్యాంకు ఎదుట తర్వాత వరంగల్, ఖమ్మం జాతీయ రహదారిపై గంటపాటు ఆందోళన చేపట్టారు. వర్ధన్నపేట సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎస్సైలు చందర్, శ్రవణ్‌కుమార్‌ బాధితులతో మా ట్లాడి ఆందోళనను విరమింపజేశారు. ఘటనాస్థలికి చేరుకున్న బ్యాంకు ఆర్‌ఎం రహీమ్‌ను బాధితులు తమకు న్యాయం చేయాలంటూ నిలదీశారు. ఒప్పుకున్న డబ్బు ఇ వ్వాలని, కోత విధించవద్దని కోరారు. దీనిపై ఆర్‌ఎం స్పంది స్తూ బాధితుల వివరాలను ఉన్నతాధికారులకు పంపామని, ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తామని వివరించారు.

తక్కువ చెల్లిస్తే ఒప్పుకోం..
రాయపర్తి ఎస్‌బీఐలో 40 గ్రాముల బంగారం తాకట్టు పెట్టాం. అయితే బ్యాంకులో బంగారం చోరీకి గురైనప్పటి నుంచి అధికారులు మాకు న్యాయం చేస్తామంటూ దాటవేస్తున్నారు. గత నెలలో తులానికి  రూ.95వేలు ఇస్తామని చెప్పారు. ప్రస్తుతం రూ.87వేలు ఇస్తామని చెబుతున్నారు. దీనికి ఒప్పుకోం. ఒప్పుకున్న ప్రకారం ఇవ్వని పక్షంలో మా బంగారం మాకు ఇవ్వాలి.
–ముద్రబోయిన సుధాకర్, బాధితుడు, రాయపర్తి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement