సింగరేణి గనిలో కూలిన బండ  | Sakshi
Sakshi News home page

సింగరేణి గనిలో కూలిన బండ 

Published Sun, Nov 27 2022 1:47 AM

Rock Collapse In Singareni Mine At Bhadradri Kothagudem District - Sakshi

సింగరేణి (కొత్తగూడెం): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సింగరేణి ఏరియా పరిధిలోని పీకేకే 5 షాప్ట్‌ గనిలో శనివారం బండ కూలింది. మొదటి షిప్ట్‌లో 36 డిప్, 121 లెవల్‌లో సీఎమ్మార్‌తో బొగ్గు ఉత్పత్తి జరుగుతున్న సమయంలో మూడు మీటర్ల బండ కంటిన్యూస్‌ మైనర్‌(సీఎమ్మార్‌) యంత్రంపై పడింది. ఈ ఘటనలో యంత్రం కొంతమేర దెబ్బతింది. యంత్రంపై మాత్రమే బండ పడటంతో పెనుప్రమాదం తప్పినట్లయింది. సీఎమ్మార్‌ మరమ్మతు పనులు పూర్తయ్యేందుకు నాలుగు రోజుల సమయం పట్టనుండటంతో అప్పటివరకు బొగ్గు ఉత్పత్తి నిలిచిపోనుంది. కాగా, తరచుగా బండ కూలే ఘటనలు పునరావృతం అవుతుండటంతో కార్మి కుల్లో ఆందోళన నెలకొంది.

Advertisement
 
Advertisement
 
Advertisement