తలసాని Vs రేవంత్‌.. ఇందిరాపార్క్‌ వద్ద ఉద్రిక్తత

Revanth Reddy Vs Talasani Yadav Community Demands Sorry From TPCC Chief - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇందిరాపార్క్‌ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, గొల్ల కురుమలను కించపరిచేలా రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. దున్నపోతులతో గాంధీభవన్‌ను ముట్టడించేందుకు యాదవ సంఘం యత్నించింది. సమాచారం అందుకున్న పోలీసులు గొల్ల కురుమలను అడ్డుకున్నారు. పలువురిని అరెస్ట్‌ చేశారు.

తలసాని Vs రేవంత్‌
కాగా రాష్ట్రంలోని యాదవ, కురుమలను అవమానిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి మంత్రి తలసానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని యాదవ జేఏసీ డిమాండ్‌ చేసింది. తమ సామాజికవర్గాన్ని తక్కువ అంచనా వేయకూడదని, రాష్ట్రంలో 20 శాతానికి పైగా జనాభా ఉన్నదని, తమ సత్తా ఏమిటో చూపుతామని అన్నారు. రేవంత్‌ రెడ్డి ఏ గల్లీలో తిరిగినా అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు. 24 గంటల్లోగా క్షమాపణ చెప్పకుంటే 25న వేలాదిగా యాదవులు, కురుమలు దున్నపోతులతో ఇందిరాపార్కు నుంచి భారీ ర్యాలీ నిర్వహిస్తామని, అక్కడి నుంచి గాంధీ భవన్‌కు చేరుకొని ముట్టడిస్తామని మంగళవారం హెచ్చరించారు. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top