Raja Singh Reacts On Arvind Dharmapuri Bandi Sanjay Issue - Sakshi
Sakshi News home page

బండి సంజయ్‌పై అలా మాట్లాడడం సరికాదు: రాజాసింగ్‌

Mar 13 2023 8:23 PM | Updated on Mar 13 2023 9:15 PM

Raja Singh Reacts On Arvind Dharmapuri Bandi Sanjay Issue - Sakshi

ఏవో ఫ్లోలో అన్న మాటలపై విమర్శలు గుప్పించడం సరికాదని..

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీలో కీలక నేతల మధ్య మాటల వేడిపై గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ స్పందించారు. కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ మీద నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ కామెంట్లు చేశాడంటూ వార్త ప్రచారంలో ఉంది. అయితే.. మీడియా ముందుకు వచ్చి రాష్ట్ర అధ్యక్షుడిపై మాట్లాడటం పద్దతి కాదని రాజాసింగ్‌ సూచించారు.

ఏదైనా ఉంటే నేరుగా మాట్లాడొచ్చని, మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం సరికాదని చెప్పారు. తెలంగాణలో బీజేపీకి మంచి స్పందన ఉందని.. ప్రభుత్వం వచ్చే అవకాశమూ ఉందని, ఒకరిపై ఒకరు కామెంట్లు చేయడం సరికాదని చెప్పారు రాజాసింగ్‌.

అలాగే.. అరవింద్‌ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూనే..  ఏవో ఫ్లోలో అన్న మాటలపై విమర్శలు గుప్పించడం సరికాదని, ఆలోచన చేయాలంటూ బండి సంజయ్‌ వ్యాఖ్యలను రాజా సింగ్‌ సమర్థిస్తూ అరవింద్‌కు సూచించారాయన.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement