రాజాసింగ్‌ లాయర్‌కు బెదిరింపులు.. చంపేస్తామంటూ..

Raja Singh Lawyer Received Threatening calls from unidentified Persons - Sakshi

సాక్షి, హైదరాబాద్: నాంపల్లి కోర్టులో రాజాసింగ్‌ కేసు వాదించిన లాయర్‌ కరుణాసాగర్‌కు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయి. బెయిల్‌ ఇప్పించినందుకు చంపేస్తామంటూ ఫోన్లో బెదిరిస్తున్నారు. అయితే దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు లాయర్‌ కరుణాసాగర్‌  తెలిపారు.

ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘న్యాయవాద వృత్తిని నేను నెరవేర్చాను. పోలీసుల వైఫల్యంతోనే రిమాండ్‌ రిజెక్ట్‌ అయింది. నిన్నటి నుంచి గుర్తు తెలియని ఆగంతకులు నాకు కాల్స్‌ చేసి చంపుతామని బెదిరిస్తున్నారు. దుబాయ్‌ నుంచి కొందరు కాల్స్‌చేసి బెదిరిస్తున్నారు. బెదిరింపులకు నేను భయపడను. దీనిపై పోలీసులు స్పందించాలి’ అని లాయర్‌ కరుణాసాగర్‌ కోరారు.

కాగా  గోషామహల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ రిమాండ్‌ను రిజెక్ట్‌ చేసిన నాంపల్లి కోర్టు.. ఆయనకు బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. 41సీఆర్పీసీ కింద నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్‌ చేశారని రాజాసింగ్‌ తరపు న్యాయవాదులు కోర్టులు వాదనలు వినిపించారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పోలీసులు అరెస్ట్‌ చేయడం చట్టవిరుద్దమని తెలిపారు. రాజాసింగ్‌ న్యాయవాదుల వాదనలతో ఏకీభవించిన కోర్టు.. ఎమ్మెల్యే రిమాండ్‌ను కోర్టు రిజెక్ట్‌ చేసింది. రాజాసింగ్‌ను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. 

చదవండి: (హైదరాబాద్‌లో అల్లర్లకు కుట్ర.. ఇది ముమ్మాటికీ నిజం: బండి సంజయ్‌)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top