ఇటు బాధ్యతలు స్వీకరించి.. అటు సీఎంను కలిసి.. | Priyanka Ala takes charge as Hyderabad district Collector | Sakshi
Sakshi News home page

ఇటు బాధ్యతలు స్వీకరించి.. అటు సీఎంను కలిసి..

Apr 27 2026 7:29 AM | Updated on Apr 27 2026 12:44 PM

Priyanka Ala takes charge as Hyderabad district Collector

హైదరాబాద్‌ నూతన కలెక్టర్‌గా ప్రియాంక అల ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సీఎం క్యాంప్‌ కార్యాలయానికి వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందజేశారు. 

విద్య, వైద్యానికి ప్రాధాన్యం: కలెక్టర్‌
కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రియాంక అల మాట్లాడుతూ.. నగరంలో విద్య, వైద్య రంగాలకు తొలి ప్రాధాన్యమివ్వనున్నట్లు తెలిపారు. బస్తీ దవాఖానాలను బలోపేతం చేసి పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు. పాఠశాల విద్య బలోపేతంతో ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రయతి్నస్తానన్నారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హుల దరిచేరేలా కృషి చేస్తానన్నారు. కలెక్టరేట్‌ పరిధిలో పనిచేసే అధికారులు, ఉద్యోగులు సమయపాలన పాటించి  తమ విభాగాలో పెండింగ్‌ పైళ్లు లేకుండా చూసుకునే విధంగా చర్యలు చేపడతానని పేర్కొన్నారు  కలెక్టరేట్, సీఎం ప్రజావాణితోపాటు ప్రస్తుతం జిల్లాలో నిర్వహిస్తున్న వాట్సాప్‌ గ్రీవెన్స్‌ సెల్‌ ద్వారా వస్తున్న దరఖాస్తులను పెండింగ్‌లో  లేకుండా చూస్తానని ప్రియాంక అల స్పష్టంచేశారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement