ఉస్మానియా.. 3 ప్రపంచ రికార్డులు

Osmania University Creates 3 World Records - Sakshi

నేషనల్‌ డాక్టర్స్‌డే సందర్భంగా ప్రదానం

అఫ్జల్‌గంజ్‌ (హైదరాబాద్‌): ఉస్మానియా ఆస్పత్రి మూడు ప్రపంచ రికార్డుల్లో చోటు దక్కించుకుంది. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఉస్మానియా ఆస్పత్రిలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రపంచ రికార్డుల భారత ప్రతినిధి లయన్‌ కె.వి. రమణారావు, దక్షిణ భారత ప్రతినిధి శ్రీవిద్య, తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి రాజు తదితరులు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బి.నాగేందర్‌కు భారత్‌ వరల్డ్‌ రికార్డ్స్, డాక్టర్స్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్, వరల్డ్‌ రికార్డ్స్‌లను అందజేశారు. ఈ సందర్భంగా రమణారావు మాట్లాడుతూ...అరుదైన శస్త్రచికిత్సలతోపాటు ప్రపంచానికి అనస్థీషియాను పరిచయం చేసిన ఘనత ఉస్మానియా ఆస్పత్రిదేనని పేర్కొన్నారు. కరోనా విజృంభణలోనూ రోగులకు మెరుగైన వైద్య సేవలందించిందని, రోగుల రద్దీ, పనిభారం పెరిగినా ఇక్కడి వైద్యులు ఒత్తిడికి గురికాకుండా సహనంతో వైద్య సేవలు అందించారని కొనియాడారు. ఆస్పత్రిలో 700 పైగా కిడ్నీ ట్రాన్స్‌ ప్లాంటేషన్‌ నిర్వహించి తెలుగు రాష్ట్రాల్లో అగ్రస్థానంలో నిలిచిందన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top