
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియాలో వైరల్ వీడియోలకు, ఫోటోలకు కొదవలేదు. కొంచెం భిన్నంగా ఎక్కడ ఎలాంటి ఘటన జరిగినా క్షణాల్లో వైరలవ్వడం కామన్ అయి పోయింది. ఇలా గతంలో అనేక విశేషణమైన, ఆశ్చర్యకరమైన చాలా వీడియోలు ఇప్పటికే నెటిజనులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఒక పెద్దాయన డాన్సింగ్ వీడియో ఒకటి హల్‌చల్ చేస్తోంది. ఎక్కడ? ఎలా జరిగింది? అనే వివరాలతో నిమిత్తం లేకుండా నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ఏమైనా ముసలాయనే గానీ..మహానుభావుడు.. డాన్స్ ఇరగదీశాడు అంటూ కమెంట్ చేస్తున్నారు.