బాలికను వివాహం చేసుకున్న కానిస్టేబుల్‌పై కేసు | Minor Girl Marriage Case Registered Against Constable | Sakshi
Sakshi News home page

బాలికను వివాహం చేసుకున్న కానిస్టేబుల్‌పై కేసు

May 20 2026 10:58 AM | Updated on May 20 2026 12:41 PM

Minor Girl Marriage Case Registered Against Constable

హుజూర్‌నగర్‌ : బాలికను వివాహం చేసుకున్న కానిస్టేబుల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ నరేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్‌నగర్‌ మండలంలోని సీతారాంపురం గ్రామానికి చెందిన కానిస్టేబుల్‌ నాయిని అనిల్‌ కుమార్‌ అనంతగిరి మండలం పాలేరు గ్రామానికి చెందిన మైనర్‌ అమ్మాయిని వారి తల్లిదండ్రులు అనుమతితో ఈ నెల 9న పెళ్లి చేసుకున్నాడని ఫిర్యాదు వచ్చింది. 

ఐసీడీఎస్‌ హుజూర్‌ నగర్‌ సెక్టార్‌ ఇన్‌చార్జి సారెడ్డి సోమమ్మ విచారణ చేయగా నిజమని తేలింది. దీంతో ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నరేష్‌ తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement