కళ్ల జోడు లేకుండా చదవలేకపోతున్నా: కేటీఆర్

సాక్షి, హైదరాబాద్: ‘జీర్ణం చేసుకోవడం కొంచెం కష్టమే అయినా.. కళ్లజోడు లేకుండా నేను ఇప్పుడు చదవలేకపోతున్నా’.. అధికారికంగానే వయసు మీరుతోంది’ అని ట్విటర్ వేదికగా మంత్రి కేటీఆర్ చమత్కరించారు. ఈ మేరకు కళ్లజోడుతో ఉన్నఫోటోలను శుక్రవారం ట్వీట్‌చ ఏశారు. బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామాను ఉద్ధేశించి ట్వీట్ చేస్తూ ‘ఆర్థిక విధానాల్లో విఫలమైన బ్రిటన్ ప్రధాని లిజ్ కేవలం 45 రోజుల్లో తన పదవికి రాజీనామా చేశారు. భారత్‌లో మాత్రం 30 ఏళ్లలో లేనంత నిరుద్యోగం, 45 ఏళ్లలో లేనంత ద్రవ్యోల్బణం, ప్రపంచంలోనే అతి ఎక్కవ ఎల్‌పీజీ ధరలు, అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ కనిష్ట స్థాయికి పడిపోవడం వంటి వాటిని మనప్రధాని ఇచ్చారు’ అని పేర్కొన్నారు.