రాజన్న ఆలయంలో ఇంటి దొంగ బాగోతం | Irregularities In Prasadam Preparation At Vemulawada Rajanna Temple, 14 Ingredients Missing | Sakshi
Sakshi News home page

రాజన్న ఆలయంలో ఇంటి దొంగ బాగోతం

Nov 18 2025 9:03 AM | Updated on Nov 18 2025 10:41 AM

Massive irregularities in Vemulawada Rajanna Temple

రాజన్న సిరిసిల్ల: వేములవాడ రాజన్న ఆలయంలో ప్రసాదం తయారీ విభాగంలో భారీ అవకతవకలు చోటుచేసుకున్నట్లు ఆలయ ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ అంశంపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయగా, కమిటీ తన నివేదికలో 14 రకాల ప్రసాద పదార్థాలు మాయమైనట్లు తేల్చింది. ఈ అవకతవకల నేపథ్యంలో వెంకటప్రసాద్ రాజు, ప్రస్తుతం సెంట్రల్ గోదాం సూపరింటెంట్‌గా పనిచేస్తున్నారు. ఆయన యాదగిరిగుట్ట నుంచి ట్రాన్స్‌ఫర్ పై వేములవాడకు వచ్చారు. 

అయితే, వెంకటప్రసాద్ వెనుక ఓ బడా రాజకీయ నేత ఉన్నట్లు ఆలయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పలు ఆరోపణలు ఉన్నప్పటికీ, వెంకటప్రసాద్ రాజుపై చర్యలు తీసుకోవడానికి జంకుతున్న ఆలయ ఉన్నతాధికారులు. మీడియా సంస్థలు ఈ అంశాన్ని వెలుగులోకి తీసుకురావడంతో, సూపరింటెండెంట్ మీడియాకు నోటీసులు పంపడం మరో వివాదంగా మారింది. ఈ ఘటన ఆలయ పరిపాలనపై ప్రశ్నలు రేపుతోంది. భక్తులు, స్థానికులు ఈ వ్యవహారంపై స్పష్టత కోరుతున్నారు.

మాయమైన పదార్థాలు:
నువ్వులు, మినపప్పు, జీలకర్ర, కాజు, కిస్మిస్, యాలకులు, జెమినీ ఛాయపొడి, బఠాణీలు, జాజికాయ, పచ్చకర్పూరం, అల్సింత కాయ, ఉలువలు, పల్లీలు, దొడ్డు శనగలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement