టెస్టు చేయలేదని తలుపు విరగ్గొట్టాడు

Man Broke Down Door That Had Not Been Tested For Covid - Sakshi

సాక్షి, నిజామాబాద్‌: తన కంటే వెనుక వచ్చిన వ్యక్తికి ముందుగా కరోనా టెస్టు చేశారని ఆగ్రహానికి గురైన ఓ వ్యక్తి హల్‌చల్‌ చేశాడు. వైద్య సిబ్బందితో వాగ్వాదానికి దిగడమే కాకుండా తలుపు విరగ్గొట్టాడు. ఈ ఘటన జిల్లా కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. నగరంలోని దుబ్బ ఆరోగ్య కేంద్రం పరిధి అరుంధతినగర్‌లోని ఓ సంఘ భవనంలో సోమవారం కరోనా టెస్టులు నిర్వహించారు. అయితే, ఓ వ్యక్తి వైద్య సిబ్బందితో దురుసుగా ప్రవర్తించాడు.

తాను ముందుగా వచ్చినా టెస్టు చేయ లేదని, తన కంటే వెనుక వచ్చిన వ్యక్తికి పరీక్ష చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ తలుపు, కిటికీలు విరగ్గొట్టాడు. అతడి దురుసు ప్రవర్తనతో కోవిడ్‌ టెస్టులు నిలిపి వేశారు. ఈ విషయంపై వైద్య సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. నేడు(మంగళవారం) ఫిర్యాదు చేస్తామని సంబంధిత వైద్యాధికారి తెలిపారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top