ఫొటోలు తీశాడని ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌పై దాడి | Lorry Driver Attack On Traffic Constable In Hyderabad | Sakshi
Sakshi News home page

ఫొటోలు తీశాడని ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌పై దాడి

Mar 20 2021 8:56 AM | Updated on Mar 20 2021 1:44 PM

Lorry Driver Attack On Traffic Constable In Hyderabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, మణికొండ: ట్రాఫిక్‌ నిబంధనలు పాటించని వాహనాల ఫొటోలు తీస్తున్న కానిస్టేబుల్‌పై దాడిచేసి గాయపర్చిన ఓ లారీ డ్రైవర్‌తో పాటు యజమానిని నార్సింగి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్సై బలరాంనాయక్‌ తెలిపిన వివరాల ప్రకారం... శుక్రవారం ఉదయం నార్సింగి చౌరస్తాలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ మల్లేశ్‌ తన విధుల్లో భాగంగా నిబంధనలు పాటించని వాహనాల ఫొటోలు తీస్తున్నారు. అదే క్రమంలో అటుగా వచ్చిన టిప్పర్‌ డ్రైవర్‌ కానిస్టేబుల్‌పై దాడి చేశాడు. దీంతో కానిస్టేబుల్‌ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో లారీ డ్రైవర్‌ రఫీక్, యజమాని రమణలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.     

Advertisement
 
Advertisement
Advertisement