దారుణాలకు ఏఐ దన్ను! | Loan app Harassment: Artificial intelligence calls | Sakshi
Sakshi News home page

దారుణాలకు ఏఐ దన్ను!

Jul 15 2024 3:45 AM | Updated on Jul 15 2024 3:45 AM

Loan app Harassment: Artificial intelligence calls

అప్పు తీసుకున్న వ్యక్తి కాల్‌లిస్టుకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కాల్స్‌ 

ప్రతీ పది నిమిషాలకు ఆటోమేటిక్‌ కాల్స్‌ 

స్పందించకపోతే ఇక తిట్ల దండకం, బెదిరింపులు 

నేతలు, పోలీసులు, డాక్టర్లు, జర్నలిస్టులు, అధికారులే బాధితులు 

ఎక్కువమంది కాల్‌లిస్టులో వీరంతా ఉండటమే కారణం

లోన్‌ యాప్‌ల కొత్తరకం వేధింపులు

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌:  కరీంనగర్‌లో ఓ డాక్టర్‌కు ఉదయం నుంచి మీరు లోన్‌ కట్టాలంటూ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) కాల్స్‌ వచ్చాయి. తరువాత వాయిస్‌ కాల్స్‌ చేసి విసిగించారు. చేసిన ప్రతీసారీ కొత్త నెంబరుతో వేధించడంతో ఏం చేయాలో పాలుపోక ఫోన్‌ స్విచాఫ్‌ చేసుకున్నారు. మీ మిత్రుడు లోన్‌ తీసుకున్నాడంటూ మరో పోలీసు అధికారికి పదే పదే ఫోన్లు చేసి విసిగించారు. ఇది కేవలం పోలీసులు, వైద్యులకే కాదు.. రాజకీయ నాయకులు, అధికారులు మొదలుకుని విలేకరులను కూడా వదలకుండా వేధిస్తున్నారు.

⇒ ఇంతకాలం కాల్‌సెంటర్ల ద్వారా వేధించిన లోన్‌యాప్‌ యాజమాన్యాలు ఇప్పుడు రూటు మార్చాయి. తమ బాకీని ఎలాగైనా వసూలు చేసుకునేందుకు సరికొత్త పంథాను ఎంచుకున్నాయి. ఆరి్టఫిíÙయల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) సాంకేతికతను సరికొత్త ఆయుధంగా 
వాడుతున్నాయి. ముందుగా లోన్‌ తీసుకునే వ్యక్తి నుంచి కాంటాక్ట్స్‌ యాక్సెస్‌ చేయాలా? అని అడుగుతారు. యాక్సెస్‌ పరి్మషన్‌ ఇవ్వకపోతే లోన్‌ రాదు. అవసరాల్లో ఉంటారు కాబట్టి అంతా కాంటాక్ట్‌ యాక్సెస్‌ పర్మిషన్‌ ఇస్తారు. ఇదే అదనుగా కాల్స్‌ చేసి 
విసిగించడంతోపాటు ఆటోమేటిక్‌ కాల్స్‌తో వేధింపులకు దిగుతున్నారు.

ఉదయం, సాయంత్రం ఏఐ కాల్స్‌!
ఒక వ్యక్తి ఫోన్‌ కాంటాక్ట్స్‌లో ఉన్న వందలు, వేల కాంటాక్ట్స్‌కి ఒకేసారి ఆర్టిఫిíÙయల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ద్వారా గ్రూప్‌ కాల్‌ వెళ్తుంది. సార్‌ మీ లోన్‌ పెండింగ్‌లో ఉంది. వెంటనే ఈ నెంబరుకు కాల్‌బ్యాక్‌ చేయండి అంటూ రికార్డెడ్‌ వాయిస్‌ వస్తుంది. ఉదయం, సాయంత్రం, లంచ్‌ సమయాల్లో ఏఐ కాల్స్‌ వస్తాయి. ప్రతీ పది నిమిషాలకు ఒకసారి కాల్స్‌ చేసి విసుగు తెíప్పిస్తాయి.

కొత్త తలనొప్పులు..
 సాధారణంగా ఎవరైనా పోలీసు, వైద్యుడు, ప్రభుత్వాధికారి, రాజకీయ నాయకుల ఫోన్‌ నంబర్లను సేవ్‌ చేసుకుంటారు. అయితే సదరు వ్యక్తి పొరపాటున అప్పు తీసుకుని కట్టకపోతే.. అప్పుడు ఈ కాంటాక్ట్స్‌లో ఉన్న వారంతా బాధితులుగా మారుతున్నారు. వీరిని లక్ష్యంగా చేసుకుంటే అప్పు వసూలు చేయవచ్చన్నది వారి వ్యూహం. ప్రజాజీవితంతో ముడిపడి పనిచేసే వీరు రోజంతా ఏదో పనిలో తలమునకలై ఉంటారు. పైగా నెంబర్లు మార్చి మార్చి చేయడంతో ఎత్తక తప్పనిసరి పరిస్థితి. తీరా ఎత్తితే.. అప్పు కట్టాలి అంటూ వేధింపులు, తిట్లు, దూషణలతో విసిగిస్తున్నారు. మొత్తానికి అకారణంగా వీరంతా వేధింపులకు గురవుతున్నారు.  

లోన్‌ యాప్‌ వేధింపుల నుంచి బయటపడండిలా..
ఎంచుకున్న లోన్‌యాప్‌ రివ్యూలు ఆన్‌లైన్‌లో చదవాకే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. 
  యాప్‌లో అనవసరమైన కాంటాక్ట్‌ ఎనేబుల్‌ పరి్మషన్స్‌ ఇవ్వరాదు. 
పదేపదే కాల్స్‌ వస్తే బ్లాక్‌ చేయాలి లేదా ట్రూకాలర్‌లో వాటిని స్పామ్‌ నంబర్లుగా రిపోర్టు చేయాలి. 
అయినా వేధింపులు ఆగకపోతే.. డయల్‌ 100కి కాల్‌ చేసి చెప్పాలి లేదా సమీపంలోని పోలీసుస్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేయాలి లేదా 1930కి కాల్‌చేసి ఫిర్యాదు చేయవచ్చు.  
httpr://cybercrime.gov.in ఈ లింక్‌లోనూ ఫిర్యాదు చేయవచ్చు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement