ముగిసిన ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్ గౌడ్ అంతిమయాత్ర | TGSRTC Strike: Employees Angry After Shankar Goud Incident, BRS Reacts | Sakshi
Sakshi News home page

Live Updates

Cricker

ముగిసిన ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్ గౌడ్ అంతిమయాత్ర

శంకర్ గౌడ్ అంత్యక్రియలు పూర్తి

  • నర్సంపేట పట్టణం ముత్తోజిపేటలో ప్రశాంతంగా కొనసాగిన ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్ గౌడ్ అంతిమయాత్ర.
  • అంతిమయాత్రలో పాల్గొన్న ఆర్టీసీ ఉద్యోగులు, బంధువులు.
  • పోలీసుల భారీ బందోబస్తు నడుమ శంకర్ గౌడ్ అంత్యక్రియలు పూర్తి.
2026-04-24 20:25:35

శంకర్‌ గౌడ్‌ అంతిమ యాత్ర ప్రారంభం

  • శంకర్‌ గౌడ్‌ అంతిమ యాత్ర ప్రారంభం
  • శంకర్‌ గౌడ్‌ అంతిమయాత్ర నిర్వహించేందుకు ఆర్టీసీ జేఏసీ సంసిద్ధత
  • శంకర్‌ గౌడ్‌ కుటుంబ సభ్యులు, ఆర్టీసీ జేఏసీ నేతలతో పోలీసులు జరిపిన చర్చలు సఫలం 
2026-04-24 16:38:23

ఆ మూడింటిపై ఏదో ఒక హామీ ఇవ్వండి: ఆర్టీసీ జేఏసీ నేతలు

  • కొనసాగుతున్న ఆర్టీసీ చర్చలు
  • సచివాలయంలో ఉన్నతాధికారులతో భేటీ అయిన ఆర్టీసీ జేఏసీ నేతలు
  • 29 అంశాలపై(డిమాండ్లు) సానుకూలంగా ఉన్న ప్రభుత్వం
  • మిగిలిన మూడు డిమాండ్లకు సమయం కావాలంటున్న అధికారులు
  • ఆ మూడింటిపైనే పట్టుబడుతున్న జేఏసీ నేతలు
  • మూడు డిమాం‍డ్లపై ఏదో ఒక హామీ ఇవ్వాలంటున్న జేఏసీ నేతలు
  • లంచ్‌ తర్వాత మంత్రుల సబ్‌ కమిటీతో భేటీ కానున్న జేఏసీ నేతలు
2026-04-24 14:04:59

శంకర్‌గౌడ్‌ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ప్రకటన

  • శంకర్‌గౌడ్‌ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ప్రకటన 
  • రూ.10 లక్షల పరిహారం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
  •  శంకర్‌ గౌడ్‌ కుమారుడికి ఆర్టీసీ ఉద్యోగం కూడా
2026-04-24 13:59:10

శంకర్‌గౌడ్‌ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే: కేటీఆర్‌

  • శంకర్‌ గౌడ్‌ మృతిపై స్పందించిన బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
  • శంకర్‌ గౌడ్‌ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే
  • ఆర్టీసీ ఉద్యోగులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం తీరని ద్రోహం చేస్తోంది
  • సమ్మెకు మద్దతు తెలిపిన బీఆర్‌ఎస్‌ నేతల్ని అరెస్ట్‌ చేయడం దారుణం
  • శంకర్‌ గౌడ్‌కు కనీసం నివాళులు కూడా అర్పించకూడదా?
  • శంకర్‌ గౌడ్‌ కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ప్రకటించాలి
2026-04-24 13:59:10

శంకర్‌ గౌడ్‌ మృతదేహాన్ని రోడ్డుపై నెట్టుకుంటూ..

  • ముత్తోజీపేటలో ఉద్రిక్త వాతావరణం
  • పోలీసులను దాటుకుంటూ ముందుకు వెళ్లిన ఆర్టీసీ కార్మికులు
  • శంకర్‌గౌడ్‌ మృతదేహాన్ని రోడ్డుపైనే నెట్టుకుంటూ తీసుకెళ్తున్న కార్మికులు
  • నర్సంపేట డిపో వద్దకు చేర్చే యత్నం 
  • అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు
  • సీఎం రేవంత్‌ డౌన్‌​ డౌన్‌ అంటూ కార్మికుల నినాదాలు
  • అటు పోలీసులతో వాగ్వాదానికి దిగిన కేంద్ర మంత్రి బండి సంజయ్‌
2026-04-24 13:28:19

ముత్తోజీపేటలో మళ్లీ టెన్షన్‌

  • వరంగల్‌ జిల్లా నర్సంపేట మండటం ముత్తోజీపేటలో టెన్షన్‌.. టెన్షన్‌
  • శంకర్‌ గౌడ్‌ నివాసానికి కేంద్ర మంత్రి బండి సంజయ్‌
  • ఆర్టీసీ సమ్మెలో పాల్గొంటున్న నర్సంపేట డిపో డ్రైవర్‌ కోలా శంకర్‌ గౌడ్‌
  • ప్రభుత్వ తీరుకు నిరసనగా నిన్న ఆత్మాహుతికి పాల్పడ్డ ఆర్టీసీ డ్రైవర్‌ కోలా శంకర్‌ గౌడ్‌
  • శంకర్‌ గౌడ్‌ కుటుంబానికి ఇవాళ బండి సంజయ్‌ పరామర్శ
  • మృతదేహాన్ని నర్సంపేట డిపో వరకు తీసుకెళ్తామని చెప్పిన బండి సంజయ్‌
  • డిపో వద్ద కాసేపు నివాళులర్పించేందుకు అనుమతి ఇవ్వాలని కోరిన బండి సంజయ్‌
  • అందుకు అనుమతించని పోలీస్‌ అధికారులు
  • ఉదయం కూడా ఇదే విషయమై పోలీసులతో ఆర్టీసీ కార్మికుల వాగ్వాదం
  • కొద్ది గంటల తర్వాత.. పోలీసులతో కేంద్ర మంత్రి వాగ్వాదం
  • ఎవరు అడ్డుకుంటారో చూస్తానంటూ బండి సంజయ్‌ వార్నింగ్‌
  • పోలీసుల వైఖరిని తప్పుబట్టిన కేంద్ర మంత్రి
  • శంకర్‌ గౌడ్‌ మృతదేహాన్ని తరలించేందుకు ప్రయత్నం
  • భారీగా మోహరించిన పోలీసులు.. ఉద్రిక్త వాతావరణం
  • పోలీసులతో ఆర్టీసీ కార్మికుల వ్వాగ్వాదం
2026-04-24 13:15:24

సానుకూల వాతావరణంలో చర్చలు

  • సచివాలయంలో కొనసాగుతున్న ఆర్టీసీ చర్చలు 
  • ఉన్నతాధికారులతో భేటీ అయిన ఆర్టీసీ జేఏసీ నేతలు
  • సానుకూల వాతావరణంలో కొనసాగుతున్న చర్చలు
  • చర్చల సారాంశాన్ని మంత్రుల సబ్‌ కమిటీకి వివరించనున్న అధికారులు
2026-04-24 13:15:24

ఆర్టీసీ సమ్మెకు ప్రొఫెసర్‌ కోదండరాం మద్దతు

  • తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె
  • ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తెలంగాణ జన సమితి మద్దతు
  • సమ్మెకు మద్దతు తెలిపిన టీజేఎస్‌ చీఫ్‌ ప్రొఫెసర్‌ కోదండరాం
  • గత ప్రభుత్వం కార్మికుల సమస్యల్ని వినేది కాదు: ప్రొ. కోదండరాం
  • ఈ ప్రభుత్వంలో వినేందుకు మంత్రులు సిద్ధంగా ఉన్నారు: ప్రొ. కోదండరాం
  • చర్చలు సఫలం కావాలని కోరుకుంటున్నా: ప్రొ. కోదండరాం
2026-04-24 11:58:34

కొనసాగుతున్న చర్చలు

  • తెలంగాణ సచివాలయంలో ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతున్న ఆర్టీసీ జేఏసీ నేతలు
  • మొత్తం 32 డిమాండ్లపైనా జరుగుతున్న చర్చ
  • 29 డిమాండ్లను నెరవేర్చేందుకు సిద్ధమని ఇప్పటికే ప్రభుత్వ ప్రకటన
  • మిగిలిన మూడు అంశాలపై ఇవాళ్టి చర్చల్లో స్పష్టత వచ్చే అవకాశం
  • చర్చల్లో పాల్గొన్న ఐఏఎస్‌లు వికాస్‌ రాజ్‌, దాన కిషోర్‌, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి
2026-04-24 11:58:34

ఆర్టీసీ చర్చల్లో హైడ్రామా?

  • తెలంగాణ సచివాలయంలో నాటకీయ పరిణామాలు
  • చర్చల కోసం సెక్రటేరియెట్‌కు వచ్చిన ఆర్టీసీ జేఏసీ నేతలు
  • తొలుత ఐఏఎస్‌ అధికారులతో చర్చలు.. ఆపై మంత్రుల సబ్‌ కమిటీతో సమావేశం
  • నేరుగా మంత్రి పొన్నం ఛాంబర్‌లోకి వెళ్లిన జేఏసీ నేతలు
  • అక్కడ మంత్రుల కోసం ఎదురు చూపులు
  • తమతో చర్చలకు రమ్మంటున్న ఉన్నతాధికారులు
  • కుదరని చెబుతున్న ఆర్టీసీ జేఏసీ నేతలు
  • మంత్రులు వస్తేనే చర్చలు జరుపుతామని.. లేకుంటే వెళ్లిపోతామంటున్న జేఏసీ నేతలు
  • పొన్నంకు సమాచారం అందించిన అధికారులు!
  • చివరకు చర్చలకు అంగీకరించిన జేఏసీ నేతలు
2026-04-24 11:15:40

శంకర్‌గౌడ్‌ నివాసం వద్ద ఉద్రిక్తత

  • వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజీపేటలో తీవ్ర ఉద్రిక్తత
  • ఆర్టీసీ డ్రైవర్‌ శంకర్‌ గౌడ్‌ నివాసానికి భారీగా తరలివచ్చిన కార్మికులు
  • నిన్న నిప్పటించుకున్న శంకర్‌ గౌడ్‌ ఆత్మాహుతి
  • శంకర్‌గౌడ్‌ మృతదేహాన్ని నర్సంపేట డిపోకు తరలించే ప్రయత్నం
  • అడ్డుకున్న పోలీసులు
  • పోలీసులతో కార్మికుల వాగ్వాదం
  • ఆర్టీసీ కార్మికులను అరెస్ట్‌ చేసిన పోలీసులు
  • శంకర్‌​ గౌడ్‌ ఇంటి  ఎదుట టెంట్‌ తొలగించిన పోలీసులు
  • పరిస్థితి తీవ్ర ఉద్రిక్తం
2026-04-24 10:27:42

చర్చలకు బయల్దేరిన జేఏసీ నేతలు

  • సచివాలయానికి బయల్దేరిన ఆర్టీసీ జేఏసీ నేతలు
  • కాసేపబ్లో కేబినెట్‌ సబ్‌ కమిటీతో భేటీ
  • ముందుగా ప్రభుత్వ ఉన్నతాధికారుల కమిటీతో చర్చలు
  • తర్వాతే డిప్యూటీ సీఎం, మంత్రుల కమిటీతో జేఏసీ నేతల చర్చలు
  • 29 అంశాల పరిష్కారానికి సిద్ధంగా ఉన్నామన్న ప్రభుత్వం
  • కీలకమైన మూడు అంశాలపై క్లారిటీ ఇచ్చే అవకాశం
  • చర్చలకు ముందు అత్యవసరంగా భేటీ అయిన జేఏసీ
  • ప్రభుత్వంతో చర్చలే అజెండాపై చర్చించిన నేతలు
  • ఆర్టీసీ డ్రైవర్‌ శంకర్‌గౌడ్‌ మృతికి సంతాపం
  • శంకర్‌ గౌడ్‌ మరణం మా అందరినీ కలిసి వేసింది
  • ఆర్టీసీలో ఇదే చివరి మరణం కావాలంటూ జేఏసీ నేతల నినాదాలు
2026-04-24 10:09:47

ముత్తోజీపేటలో విషాద ఛాయలు..

  • కోలా శంకర్‌గౌడ్‌ మృతితో ముత్తోజీపేటలో విషాద ఛాయలు
  • నర్సంపేట డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్న శంకర్‌గౌడ్‌
  • సమ్మెలో భాగంగా ప్రభుత్వ తీరుకు నిరసనగా నిన్న  పెట్రోల్‌ పోసుకుని నిప్పటించుకున్న శంకర్‌
  • 80 శాతం కాలిన గాయాలతో హైదరాబాద్‌కు తరలింపు
  • గత అర్ధరాత్రి చికిత్స పొందుతూ కన్నుమూత
  • పోస్ట్‌మార్టం అనంతరం శంకర్‌ స్వస్థలం నర్సంపేట మండలం ముత్తోజిపేటకు మృతదేహం తరలింపు
  • భారీ సంఖ్యలో శంకర్‌ నివాసానికి చేరుకుని నివాళులర్పిస్తున్న కార్మికులు
  • నర్సంపేట బస్సు డిపోకు మృతదేహాన్ని తరలించే ప్రయత్నం
  • ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికుల నినాదాలు
2026-04-24 10:02:26

శంకర్‌గౌడ్‌ ఆత్మబలిదానం కలిచి వేసింది

  • ఆర్టీసీ డ్రైవర్‌ ఆత్మాహుతి ఘటనపై స్పందించిన మాజీ మంత్రి హరీష్‌ రావు
  • శంకర్‌గౌడ్‌ ఆత్మబలిదానం కలిచి వేసింది
  • సంస్థను కాపాడేందుకు.. కార్మిక హక్కుల కోసం.. ప్రాణత్యాగం చేసిన శంకర్‌గౌడ్‌కు ఘన నివాళులు
2026-04-24 09:55:33

జనగామలో టెన్షన్‌.. టెన్షన్‌

  • జనగామ బస్టాండ్‌ వద్ద ఉద్రిక్తత
  • ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిని అడ్డుకున్న పోలీసులు
  • ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా నిరసన తెలిపే ప్రయత్నం
  • అడ్డుకున్న పోలీసులు.. ఆర్టీసీ కార్మికుల వాగ్వాదం
  • డీఎం ఆఫీస్‌ వద్ద బీఆర్‌ఎస్‌ నేతలు, ఆర్టీసీ కార్మికుల నిరసన
2026-04-24 09:55:33

మూడో రోజు కొనసాగుతున్న సమ్మె

  • తెలంగాణలో మూడో రోజు కొనసాగుతున్న సమ్మె
  • బస్సుల్లేక తీవ్ర అవస్థలు పడుతున్న ప్రయాణికులు
  • ఖాళీగా బస్టాండులు, బస్టాపులు
  • అధిక ధరలు చెల్లించి ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణాలు
  • ఆర్టీసీ డ్రైవర్‌ శంకర్‌ గౌడ్‌ మృతితో తీవ్ర రూపం దాల్చిన సమ్మె
  • డిపోల ముందు నల్ల బ్యాడ్జీలతో కార్మికుల నిరసన
  • అద్దె బస్సులనూ అడ్డుకుంటున్న కార్మికులు 
  • మూడో రోజు మరింత తగ్గిపోయిన బస్సుల సంఖ్య
  • నేడు ఆర్టీసీ ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు
  • చర్చలకు ఆహ్వానించిన మంత్రుల సబ్‌ కమిటీ
2026-04-24 08:51:49

శంకర్‌ గౌడ్‌ మృతితో వరంగల్‌లో హైటెన్షన్‌

  • శంకర్‌ గౌడ్‌ మృతితో వరంగల్‌లో హైటెన్షన్‌
  • ప్రభుత్వ తీరుకు నిరసనగా నర్సంపేట డిపో డ్రైవర్‌ కోలా శంకర్‌ గౌడ్‌ ఆత్మాహుతి
  • సమ్మెలో పాల్గొంటూ నిన్న పెట్రోల్‌ పోసుకుని నిప్పటించుకున్న శంకర్‌ గౌడ్‌
  • అర్ధరాత్రి హైదరాబాద్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత
  • నేడు ఉమ్మడి వరంగల్‌ బంద్‌కు పిలుపు ఇచ్చిన ఆర్టీసీ జేఏసీ
  • నర్సంపేటకు ఆర్టీసీ జేఏసీతో పాటు పలువురు రాజకీయ నేతలు
  • అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తమైన పోలీసులు
2026-04-24 08:51:49

చర్చలకు వెళ్లాలా? వద్దా?

  • నేడు ఆర్టీసీ జేఏసీతో ప్రభుత్వం చర్చలు
  • శంకర్‌ గౌడ్‌ మృతితో కార్మికుల్లో ప్రభుత్వంపై ఆగ్రహావేశాలు
  • ప్రభుత్వం పూర్తిగా దిగి వచ్చేదాకా సమ్మె కొనసాగించాలనే యోచన 
  • ఇప్పటికే ఆరు రోజులపాటు షెడ్యూల్‌ ప్రకటించిన జేఏసీ
  • నేడు అన్ని డిపోల ఎదుట నల్ల బ్యాడ్జీలతో మౌన ప్రదర్శనలు నిర్వహిస్తున్న కార్మికులు
  • శంకర్‌ గౌడ్‌ ఘటన నేపథ్యంలో.. సంయమనం పాటించాలని కార్మికులకు ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం, జేఏసీ నేతల పిలుపు
  • చర్చలకు వెళ్తే కీలకమైన మూడు అంశాలపై ప్రభుత్వం నుంచి క్లారిటీ వచ్చే అవకాశం
  • చర్చలకు వెళ్లాలా? వద్దా? అనే దానిపై ఏ నిర్ణయం తీసుకోని జేఏసీ నేతలు
  • నర్సంపేట వెళ్లి శంకర్‌ గౌడ్‌ కుటుంబాన్ని పరామర్శించాలంటున్న కొందరు జేఏసీ నేతలు?
  • చర్చలకు వెళ్దామంటున్న మరికొందరు?
2026-04-24 08:43:15

కాంగ్రెస్‌ సర్కార్‌పై బండి సంజయ్‌ ఆగ్రహం

  • నేడు నర్సంపేట(వరంగల్‌)కు కేంద్ర మంత్రి బండి సంజయ్‌
  • ఆర్టీసీ డ్రైవర్‌ శంకర్‌ గౌడ్‌ బలవన్మరణంపై బండి సంజయ్‌ దిగ్భ్రాంతి
  • శంకర్‌ గౌడ్‌ అంత్యక్రియల్లో పాల్గొనే అవకాశం
  • శంకర్‌ గౌడ్‌ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే: బండి సంజయ్‌
  • ఆర్టీసీ కార్మికుల సమస్యల్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం గాలికొదిలేసింది: బండి సంజయ్‌
2026-04-24 08:38:24

ఆర్టీసీ జేఏసీ ఎమర్జెన్సీ మీటింగ్‌

  • మరికాసేపట్లో ఆర్టీసీ జేఏసీ నేతల అత్యవసర సమావేశం
  • నర్సంపేట వెళ్లాలనే యోచనలో జేఏసీ నేతలు
  • నిన్న నర్సంపేట డిపో డ్రైవర్‌ శంకర్‌ గౌడ్‌ ఆత్మాహుతి
  • శంకర్‌గౌడ్‌ మృతి ఘటన నేపథ్యంలో ఆర్టీసీ కార్మికుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు.. ఆందోళనలు
  • ప్రభుత్వంతో చర్చలకు వెళ్లాలా? వద్దా? అనేదానిపై స్పష్టత ఇచ్చే అవకాశం
  • ఆర్టీసీ జేఏసీ నేతలను చర్చలకు ఆహ్వానించిన మంత్రుల సబ్‌ కమిటీ
  • సమస్యల పరిష్కారానికి సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే ప్రకటించిన ప్రభుత్వం
2026-04-24 07:21:17

శంకర్‌గౌడ్‌ బలవన్మరణంపై సీఎం రేవంత్‌ దిగ్భ్రాంతి

  • ఆర్టీసీ డ్రైవర్‌ కోల శంకర్‌గౌడ్‌ బలవన్మరణం పట్ల సీఎం రేవంత్‌ రెడ్డి దిగ్భ్రాంతి
  • శంకర్‌గౌడ్‌ కుటుంబానికి అండగా ఉంటాం
  • అన్నివిధాలా ఆదుకుంటామని శంకర్‌గౌడ్‌ కుటుంబ సభ్యులకు సీఎం రేవంత్‌ హామీ
  • ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది
  • కార్మికుల సమస్యలను పరిష్కరించాలనే చిత్తశుద్ధితో ఉన్నాం
  • ఆర్టీసీ కార్మికులు సంయమనం పాటించాలి
2026-04-24 07:12:19

శంకర్‌ గౌడ్‌కు నివాళులు.. నిరసనలు

  • తెలంగాణలో మూడో రోజు కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె 
  • అర్ధరాత్రి దాటాక డిపోల ముందు చేరిన కార్మికులు
  • తెలంగాణ ఆర్టీసీ సమ్మెలో నిన్న విషాదం
  • నర్సంపేట డిపో ఆర్టీసీ డ్రైవర్‌ కన్నుమూత
  • పెట్రోల్‌ పోసి నిప్పటించుకున్న శంకర్‌ గౌడ్‌
  • హుటాహుటిన హైదరాబాద్‌కు తరలింపు
  • అర్ధరాత్రి 2.30 గం. ప్రాంతంలో చికిత్స పొందుతూ  కన్నుమూత
  • శంకర్‌ గౌడ్‌ ఫొటోలతో తెలంగాణ వ్యాప్తంగా పలు డిపోల ముందు నిరసన తెలుపుతున్న కార్మికులు
  • తోటి కార్మికుడికి నివాళులు అర్పిస్తున్న ఉద్యోగులు
2026-04-24 06:57:31

తీవ్రతరం దాలుస్తున్న ఆర్టీసీ సమ్మె

  • తెలంగాణ ఆర్టీసీ సమ్మెలో నిన్నటి ఘటనలు
  • పలు డిపోల ముందు బైఠాయించి బస్సుల్ని కదలనీయని డ్రైవర్లు
  • వరంగల్‌ నర్సంపేట డిపో డ్రైవర్‌ శంకర్‌ గౌడ్‌ పెట్రోల్‌ పోసుకుని ఆత్మాహుతి
  • నల్గొండలో డ్రైవర్‌ ఆర్‌.వెంకన్న అత్మహత్యాయత్నం 
  • జనగామ తోపులాటలో స్పృహ తప్పి పడిపోయిన కండక్టర్‌ కృష్ణవేణి 
  • తమ నిరసనలను అనుమతించాలని సీఐ అబ్బయ్య కాళ్లు మొక్కిన ఓ కండక్టర్‌
2026-04-24 06:57:31

నేడు ఉద్యోగ సంఘాలతో చర్చలు

  • నేడు ఆర్టీసీ ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు
  • ఉదయం 10.గం. చర్చలు జరపనున్న ప్రభుత్వం
  • సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేయనున్న అధికారులు
  • కీలక డిమాండ్లను నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే మంత్రి పొన్నం స్పష్టీకరణ
2026-04-24 06:57:31

శంకర్‌గౌడ్‌ మృతిపై స్పందించిన మంత్రి పొన్నం

  • శంకర్‌గౌడ్‌ మృతి బాధాకరం
  • శంకర్‌ గౌడ్‌ కుటుంబానికి అండగా ఉంటాం
  • శంకర్‌గౌడ్‌ కుటుంబాన్ని అన్నివిధాల ఆదుకుంటాం
  • కార్మికుల సమస్యల పరిష్కారానికి సానుకూలంగా ఉన్నాం
  • క్షణికావేశంలో కార్మికులు ఎవరూ ప్రాణాలు తీసుకోవద్దు
  • కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
2026-04-24 06:57:31

మంత్రులతో సబ్‌ కమిటీ

  • ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వ కీలక నిర్ణయం
  • సమస్యల పరిష్కారానికి మంత్రుల సబ్‌కమిటీ
  • ఐదుగురు మంత్రులతో సబ్‌ కమిటీ
  • నేడు కార్మిక సంఘాలతో చర్చలు జరపనున్న సబ్‌ కమిటీ

 

2026-04-24 06:57:31

నేడు వరంగల్‌ బంద్‌

  • నేడు వరంగల్‌ బంద్‌కు ఆర్టీసీ జేఏసీ పిలుపు
  • శంకర్‌గౌడ్‌ మృతి నేపథ్యంలో బంద్‌ పాటించాలని నిర్ణయం
  • అప్రమత్తమైన పోలీసులు
  • ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అలర్ట్‌
2026-04-24 06:57:31

తొందరపాటు నిర్ణయాలు వద్దు: ఆర్టీసీ ఎండీ

  • శంకర్‌ గౌడ్‌ మృతి ఘటనపై స్పందించిన ఆర్టీసీ యాజమాన్యం
  • ఆర్టీసీ ఉద్యోగులు అధైర్య పొడొద్దంటున్న ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి
  • ప్రభుత్వం మీకు అండగా ఉంది
  • తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు 
  • ఆర్టీసీ ఉద్యోగులు సంయమనం పాటించాలి
  • ఉద్యోగుల డిమాండ్ల పరిష్క్యారమే యాజమాన్య ధ్యేయం
2026-04-24 06:57:31

శంకర్‌ గౌడ్‌ మృతితో..

  • ఆర్టీసీ సమ్మెలో విషాద ఘటన
  • నర్సంపేట(వరంగల్‌) డిపోకు చెందిన శంకర్‌ గౌడ్‌ మృతి
  • సమ్మెలో భాగంగా.. నిన్న పెట్రోల్‌ పోసుకుని నిప్పటించుకుని నిరసన తెలిపిన శంకర్‌
  • పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలింపు
  • సంతోష్‌ నగర్‌ డీఆర్‌డీవో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత
  • పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహం స్వస్థలానికి తరలింపు
2026-04-24 06:57:31
Advertisement
 
Advertisement
Advertisement