Live Updates

‘స్థానిక’ నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టే.. నిలిచిపోయిన నామినేషన్ల ప్రక్రియ
హైకోర్టు స్టే తో అలర్ట్ అయిన ఎలక్షన్ కమిషన్
- స్థానిక సంస్థల నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టే.. అలర్ట్ అయిన ఎలక్షన్ కమిషన్
- లీగల్ కౌన్సిల్ తో సంప్రదింపులు మొదలు పెట్టిన ఎస్‌ఈసీ
- హై కోర్టు ఆర్డర్ కాఫీ కోసం వెయిట్ చేస్తున్న లీగల్ టీం
- ఆర్డర్ కాపీ తర్వాత తదుపరి ప్రకటన చేయనున్న స్టేట్ ఎలక్షన్ కమిషన్.
లంగాణ లోకల్ బాడీ ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలపై స్టే విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జీవో 9 పై కూడా హైకోర్టు స్టే విధించింది. దాంతో లోకల్ బాడీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియకు ఫుల్‌స్టాప్ పడింది.
హైకోర్టులో మరికాసేపట్లో రిజర్వేషన్లపై విచారణ
- రిజర్వేషన్ల అంశంపై మరికాసేపట్లో హైకోర్టులో విచారణ
- నిన్నంతా హాట్ హాట్‌గా సాగిన వాదనలు
- ఇవాళ కూడా వాదనలు వినిపించనున్న ప్రభుత్వం
- ఈ ఉదయం విడుదలైన స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్
- కోర్టు తీర్పుపైనే ఆధారపడిన ఎన్నికల నిర్వహణ
- ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోబోమని.. హైకోర్టుదే నిర్ణయమన్న సుప్రీం కోర్టు
- హైకోర్టు నిర్ణయం ఎలా ఉండబోతుందా? అని సర్వత్రా ఉత్కంఠ
- అభ్యర్థుల ఎంపిక హడావిడిలో కాంగ్రెస్
- కోర్టు విచారణ నేపధ్యంతో.. వేచిచూసే ధోరణిలో బీఆర్‌ఎస్, బీజేపీ
సీరియస్‌గా ఉండండి.. నామినేషన్లు వేయండి

- జూమ్ మీటింగ్‌లో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
- బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేసింది.
- కోర్టు కూడా మన వాదనలను అంగీకరిస్తుందని ఆశిస్తున్నాం
- ఈ రోజు స్థానిక సంస్థలు నోటిఫికేషన్ వచ్చింది.. మొదటి విడత ఎన్నికలు జరిగే ప్రాంతాలలో నామినేషన్లు ప్రారంభం అయ్యాయి
- కాంగ్రెస్ శ్రేణులు చాలా సీరియస్ గా ఉండాలి.. నామినేషన్లు వేయాలి
- దేశ చరిత్రలో స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లు అనేది ఒక పెద్ద సామాజిక విప్లవం
- ఈ విషయంలో కాంగ్రేస్ పార్టీ చేసిన కృషిని ప్రజల్లో బాగా తీసుకుపోవాలి
రాత్రికల్లా లిస్ట్ రెడీ కావాలి: సీఎం రేవంత్

- స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్
- పార్డీ కేడర్‌ను సమాయత్తం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్
- టీ పీసీసీ జూమ్ మీటింగ్‌లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
- ఇంచార్జ్ మంత్రులు వాళ్ల జిల్లాల నాయకులతో అత్యవసరంగా మాట్లాడాలి
- అభ్యర్థులను ఫైనల్ చేసి బీ ఫారం ఇవ్వాలి.. నో డ్యూ సర్టిపికేట్ లు ఇప్పించాలి
- లీగల్ సెల్‌ను యాక్టివ్ చేయాలి.. గాంధీ భవన్‌లో లీగల్ టీమ్ అందుబాటులో ఉండాలి..
- గాంధీ భవన్‌లోనే సమన్వయం కోసం ఒక టీమ్ పెట్టాలి
- రాత్రికల్లా తొలివిడత అభ్యర్థుల జాబితా సిద్ధం కావాలి
- ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు అన్ని పరిస్థితులను ఎదుర్కొని ముందుకెళుతున్నాం
- వివిధ జిల్లాలకు సంబంధించిన ఇంచార్జి మంత్రులు ముఖ్య నాయకులతో సమావేశమై రిజర్వేషన్ల దామాషా ప్రకారం అభ్యర్థులను ఫైనల్ చేయాలి
- పూర్తిస్థాయిలో సమయం కేటాయించి నామినేషన్ల ప్రక్రియకు సమయం కేటాయించాలి
- పీసీసీ లీగల్ టీమ్ నుంచి నామినేషన్ అప్లికేషన్ కు సంబంధించి మోడల్ ఫార్మాట్ క్షేత్రస్థాయికి పంపించాలి
- గాంధీ భవన్‌లో లీగల్ అంశాలను నివృత్తి చేసేందుకు కో-ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులో ఉంచాలి.
- ఎన్నికల ప్రక్రియపై అవగాహన ఉన్నవారు కమిటీలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి
- ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్ పదవుల ఎంపికపై పీసీసీ చర్చించి నిర్ణయం తీసుకుంటుంది
- అప్పటివరకు వాటిపై రాజకీయంగా ఎలాంటి ప్రకటనలు చేయొద్దు
- బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో జరిగే వాదనలు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలి
- హైకోర్టులో బీసీ రిజర్వేషన్ కేసు పైన పీసీసీ చీఫ్ పర్యవేక్షణ చేయాలి
- తీర్పు తర్వాత తదుపరి కార్యాచరణ కోసం రాత్రికి మరో మీటింగ్ నిర్వహించాలి
నామినేషన్‌లు స్వీకరణ ప్రారంభం
- మొదటి విడత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్‌లు స్వీకరణ ప్రారంభం
- మొదటి విడత నోటిఫికేషన్ జారీ చేసిన రిటర్నింగ్ అధికారులు
- ఈ నెల 11 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్‌లు స్వీకరణ
- మొదటి విడతలో 292 జడ్పీటీసీ, 2,964 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు
- గతనెల 29న షెడ్యూల్, నోటిఫికేషన్ జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం
ఉమ్మడి మెదక్ జిల్లాల్లో..
- తొలివిడతలో మెదక్ జిల్లా పరిదిలో 10 జెడ్పీటీసీ, 99 ఎంపీటీసీలకు ఎన్నిక
- సంగారెడ్డి జిల్లా పరిదిలోని 12 జెడ్పీటీసీ, 129 ఎంపీటీసీలకు ఎన్నిక
- సిద్దిపేట జిల్లా పరిదిలోని 15 జెడ్పీటీసీ, 125 ఎంపీటీసీలకు తొలివిడతలోనే ఎన్నిక
మహబూబాబాద్ జిల్లాలో..
- మహబూబాబాద్ జిల్లాలో మొదటి విడతలో 9 జెడ్పీటీసీ, 104 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు
- బయ్యారం , చిన్న గూడూరు, దంతాలపల్లి, గార్ల, గూడూరు, మహబూబాబాద్, నరసింహాలపేట, పెద్దవంగర, తొర్రూరు మండలాలు
- 554 పోలింగ్ కేంద్రాల ద్వారా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో..
- జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో.. మొదటి విడత లో 6 మండలాల్లో ఎన్నికలు
- జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మొత్తం..12 జెడ్పిటిసి 109 ఎంపీటీసీ స్థానాలు
- మొదటి విడతలో 6 జెడ్పిటిసిలు 58 ఎంపీటీసీ స్థానాలకు జరగనున్న ఎన్నికలు
- గణపురం,చిట్యాల,టేకుమట్ల,మొగుళ్ళపల్లి,రేగొండ,గోరుకొత్తపల్లిలకు 23న పోలింగ్
- 19 మంది రిటర్నింగ్ ఆఫీసర్ల నియామకం
- ఓటు హక్కు వినియోగించుకొనున్న 3 లక్షల 21 వేల 43 మంది ఓటర్లు
ఓటర్ల జాబితా ఇవ్వరా?
- ఓటర్ల జాబితాను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు ఇవ్వని అధికారులు
- ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న పలు పార్టీల నేతలు
- ఓటర్ లిస్టు అడిగితే అధికారులు తలా ఒక మాట మాట్లాడుతున్నారని ఆగ్రహం
నామినేషన్ వేయాలంటే..
- తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్ విడుదల చేసిన రిటర్నింగ్ అధికారులు
- 31 జిల్లాలో రెండు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు
- మొదటి విడతలో 31 జిల్లాలో 58 రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఎన్నికలు
- 292 జెడ్పీటీసీ, 2,963 ఎంటీసీ స్థానాలకు నామినేషన్ ల స్వీకరణ.
- నామినేషన్ లు వేసే అభ్యర్థులు డిపాజిటీ చేయాల్సిన మొత్తం జెడ్పీటీసీ జనరల్ అభ్యర్థి 5,000, రిజర్వేషన్ అభ్యర్థి 2,500
- ఎంపీటీసీ నామినేషన్ దాఖలు చేసే జనరల్ అభ్యర్థి రూ.2,500, రిజర్వేషన్ అభ్యర్థి రూ.1,250 రూపాయలు.
- ఈ నెల 11వ తేదీ వరకు నామినేషన్ స్వీకరించనున్న రిటర్నింగ్ అధికారులు
- 23వ తేదీన పోలింగ్ నవంబర్ 11న కౌంటింగ్
స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

- తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
- ఎన్నికల నోటిఫికేషన్ గెజిట్ విడుదల చేసిన స్టేట్ ఎలక్షన్ కమిషన్


- మరికాసేపట్లో నామినేషన్ ప్రక్రియ మొదలు పెట్టనున్న రిటర్నింగ్ అధికారులు
- ఈ నెల 11వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్న రిటర్నింగ్ అధికారులు
- ఉదయం 10.30గం. నుంచి సాయంత్రం 5గం. దాకా నామినేషన్ల స్వీకరణ
- మొదటగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు...రెండు విడతల్లో ఎన్నికలు
- మొదటిదశలో ఎంపీటీసీ 2963, జెడ్పీటీసీ 292 స్థానాలకు ఎన్నికలు
- ఈనెల 23వ తేదీన మొదటి దశ ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికల పోలింగ్.
- నవంబర్ 11వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ
ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో..
- నేటి నుంచి స్థానిక సమరానికి నామినేషన్ల స్వీకరణ
- ఉదయం పదిన్నరకు నోటిఫికేషన్ జారీ
- కరీంనగర్ జిల్లాలో.. మొత్తం 15 జెడ్పీటీసీలు, 170 ఎంపీటీసీ స్థానాలకు మొదలు కానున్న ఎన్నికల ప్రక్రియ
- మొదటి దఫాలో జిల్లాలోని హుజూరాబాద్ డివిజన్ పరిధిలోని ఆరు మండలాల్లో 6 జెడ్పీటీసీ స్థానాలు, 70 ఎంపీటీసీ స్థానాలకు జరుగనున్న ఎన్నికలు
- శంకరపట్నం, వీణవంక, ఇల్లందకుంట, జమ్మికుంట, హుజూరాబాద్, సైదాపూర్ మండలాల్లో తొలివిడతలో జరుగనున్న పరిషత్ ఎన్నికలు
- జగిత్యాల జిల్లాలో.. మొదటి విడతలో పది జెడ్పీటీసీ స్థానాలతో పాటు, 108 ఎంపీటీసీ స్థానాలకు జరుగనున్న ఎన్నికలు..
- తొలివిడతలో బీర్పూర్, రాయికల్, సారంగాపూర్, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, మెట్ పెల్లి, భీమారం, కథలాపూర్, కోరుట్ల, మేడిపల్లి మండలాల్లో జరుగనున్న ఎన్నికలు
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో.. మొదటి విడతలో 7 జెడ్పీటీసీ, 65 ఎంపీటీసీ స్థానాలకు స్థానిక సంస్థల ఎన్నికలు..
- బోయినపల్లి, చందుర్తి, రుద్రంగి, వేములవాడ అర్బన్, వేములవాడ రూరల్, కోనరావుపేట, ఇల్లంతకుంట మండలాల్లో మొదటి విడతలో జరుగనున్న ఎన్నికలు
- పెద్దపెల్లి జిల్లాలో.. మొదటి విడతలో 7 జెడ్పీటీసీ, 68 ఎంపీటీసీ స్థానాలకు జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు...
- అంతర్గాం, ధర్మారం, పాలకుర్తి, కమాన్ పూర్, మంథని, ముత్తారం, రామగిరి మండలాల్లో జరుగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు..
- కోర్టులో బీసీ రిజర్వేషన్ల ప్రక్రియపై విచారణ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై నెలకొన్న ఉత్కంఠ.
- అయినా సంబంధం లేకుండా యధాతథంగా నోటిఫికేషన్ విడుదల చేయనన్న రాష్ట్ర ఎన్నికల సంఘం
ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో ఇలా..
- తొలి విడతలో.. నల్లగొండ, దేవరకొండ డివిజన్లలోని 18 జెడ్పీటీసీ, 197 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు
- రెండు డివిజన్లలో ఓటేయనున్న 600316 మంది ఓటర్లు
- సూర్యాపేట జిల్లాలో.. మొత్తం జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల సంఖ్య- 23
- తొలి విడతలో ఈనెల 23న ఎన్నికలు జరిగే స్థానాలు: జెడ్పీటీసీ 11, ఎంపీటీసీ 112
- యాదాద్రి భువనగిరి జిల్లాలో.. మొత్తం జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల సంఖ్య- 17
- తొలి విడతలో ఈనెల 23న ఎన్నికలు జరిగే స్థానాలు: జెడ్పీటీసీ 10, ఎంపీటీసీ 84
తెలంగాణ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్
- మొదటి విడత ఎంపీటీసీ (2,963), జడ్పీటీసీ (292) ఎన్నికలు
- నోటిఫికేషన్.. నామినేషన్ల స్వీకరణ ప్రారంభం: అక్టోబరు 9(ఇవాళే)
- చివరి తేదీ: అక్టోబరు 11
- పరిశీలన: అక్టోబరు 12
- ఉపసంహరణ: అక్టోబరు 15
- అక్టోబర్ 23 తొలివిడత పోలింగ్
- నవంబర్ 11న ఓట్ల లెక్కింపు.. విజేతల ప్రకటన
బీసీ రిజర్వేషన్లపై నేడు హైకోర్టులో విచారణ

- స్టానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన జీవో నెంబర్ 9 రాజ్యాంగ విరుద్ధమంటూ పిటిషన్లు
- ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ దాఖలైన బీసీ నేతల ఇంప్లీడ్ పిటిషన్లు
- మొత్తం ఆరు పిటిషన్లను కలిపి నిన్న విచారించిన హైకోర్టు
- ఇవాళ మధ్యాహ్నాం2గం.15ని. మరోసారి విచారణ
- వాదనలు వింటున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ (ఏకే సింగ్) బెంచ్
- ఇవాళ మరికొన్నివాదనలు వినిపిస్తామన్న అడ్వొకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి
- ఇంప్లీడ్ పిటిషనర్ల వాదనలు చివర్లోనే వింటామన్న చీఫ్ జస్టిస్
- కోర్టు విచారణతో సంబంధం లేకుండా.. నేడు నోటిఫికేషన్ విడుదల
నోటిఫికేషన్లకు ఏర్పాట్లు పూర్తి
- తెలంగాణలోని 31 జిల్లాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ మొదటి దశ ఎన్నికలు
- నోటిఫికేషన్ల జారీకి జిల్లా ఏర్పాట్లు పూర్తి చేసిన జిల్లా అధికారులు(కలెక్టర్లు)
- మొదటి దశలో మొత్తం 53 రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 292 మండలాల పరిధిలో ఉన్న 292 జెడ్పీటీసీ, 2,963 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు
- ఎంపీటీసీలకు మండల కార్యాలయాల్లో, జెడ్పీటీసీల కోసం జిల్లా పరిషత్‌కార్యాలయాల్లో నామినేషన్ల స్వీకరణ
- నాలుగైదు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు కలిపి ఒక రిటర్నింగ్ అధికారి
- మొదటి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ల జారీ, నామినేషన్లు స్వీకరణ, ఎన్నికల కోడ్ అమలు, భద్రతా ఏర్పాట్లపై.. ఇప్పటికే సమీక్షలు
కోర్టు తీర్పు దాకా ఆగుదాం!

- షెడ్యూల్ ప్రకారం స్థానిక ఎన్నికల నోటిఫికేషన్
- నేడు 10.30గంటలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్న ఎస్ఈసీ
- రెండు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు
- నేటినుండి నుంచి తొలిదశ.. ఎంపీటీసీ, జడ్పీటీసీ తొలివిడత నామినేషన్ల స్వీకరణ
- అక్టోబర్ 23 తొలివిడత పోలింగ్
- నవంబర్ 11న ఓట్ల లెక్కింపు.. విజేతల ప్రకటన
- నోటిఫికేషన్ రాగానే కాంగ్రెస్ నామినేషన్లు
- కోర్టు తీర్పు తర్వాత చూద్దాం అనే ధోరణిలో బీఆర్‌ఎస్, బీజేపీ
కాంగ్రెస్.. గెట్ రెడీ!

- స్థానిక ఎన్నికల్లో పోటీకి కాంగ్రెస్ సిద్ధం
- నోటిఫికేషన్ రాగానే నామినేషన్ దాఖలు చేయాలని నిర్ణయం
- అందుబాటులో ఉన్న మంత్రులు ,ఎమ్మెల్యేలతో ఇప్పటికే పీసీసీ ఛీఫ్ భేటీ
- ఇవాళ పీసీసీ నేతలందరితో పాటు డీసీసీ(జిల్లా అధ్యక్షుల)లతో జూమ్ మీటింగ్
- అభ్యర్థుల ఎంపికపై డీసీసీలను అలర్డ్ చేయనున్న పీసీసీ
ఇటు నోటిఫికేషన్.. అటు కోర్టు విచారణ
- ఇవాళ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల మొదటి విడత నోటిఫికేషన్
- మరోవైపు.. బీసీల రిజర్వేషన్లపై ఇవాళ హైకోర్టు విచారణ
- కోర్టు విచారణతో సంబంధం లేకుండా యధాతథంగా నోటిఫికేషన్‌కు ఎస్‌ఈసీ సిద్ధం
- ఎన్నికల ప్రక్రియ ముందుకెళ్తుందా? బ్రేక్ పడుతుందా? అనే సందిగ్ధత
- ఇప్పటికే అనేక మలుపులు తిరిగిన బీసీ రిజర్వేషన్ల అంశం
- ఎలాంటి కొలిక్కి వస్తుందో అని రాష్ట్రవ్యాప్తంగా చర్చోపచర్చలు