6 నెలల్లో ఇంటింటికీ ఇంటర్నెట్‌ | Internet to every home in 6 months | Sakshi
Sakshi News home page

6 నెలల్లో ఇంటింటికీ ఇంటర్నెట్‌

Apr 11 2025 4:28 AM | Updated on Apr 11 2025 4:28 AM

Internet to every home in 6 months

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు

ఇకపై టీనెక్ట్స్‌ బ్రాండ్‌తో టీఫైబర్‌ సేవలు

టీఫైబర్‌ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి 

సనత్‌నగర్‌ (హైదరాబాద్‌): వచ్చే ఆరునెలల్లో ఇంటింటికీ ఇంటర్నెట్‌ సేవలు, స్మార్ట్‌ టీవీ సదుపాయం అందించాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలి పారు. బేగంపేటలో గురువారం టీఫైబర్‌ నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అలాగే టీఫైబర్, టీనెక్ట్స్‌ జెన్‌ టెక్నాల జీస్‌కు సంబంధించిన లోగోలను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన డేటాను సురక్షితంగా ఉంచగల సావరిన్‌ క్లౌడ్‌ను మంత్రి ప్రారంభించారు. 

ఇదే వేదికపై టీఫైబర్‌ అధికారిక చిహ్నమైన టెరాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ కేబుల్‌ ఆపరేటర్ల సహకారంతో ప్రజ లకు టీవీ చానెల్స్‌ సదుపాయాలు కూడా కల్పిస్తామ న్నారు. టీవీ సెట్లను కంప్యూటర్‌ మానిటర్‌గా విని యోగించుకుని, విద్యార్థులు ప్రయోజనం పొందేలా టెక్నాలజీని రూపొందించినట్లు చెప్పారు. టీఫైబర్‌ ఇప్పటికే 424 మండలాల్లోని 8,891 గ్రామపంచాయతీలకు అనుసంధానం చేసిందన్నారు.

మరో 7,187 పంచాయతీలు ఈ సేవలు అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. ఈ ఏడాది 30 వేల ప్రభుత్వ కార్యాలయాలకు కనెక్టివిటీ కల్పించినట్లు వివరించారు. 2027 నాటికి 60 వేల కార్యాలయాలను అనుసంధానం చేస్తామన్నారు. టీఫైబర్‌ ఇకపై టీనెక్ట్స్‌ పేరుతో సేవలు అందిస్తుందని చెప్పారు. అంతకుముందు తెలంగాణ ఫైబర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా శ్రీధర్‌బాబు బాధ్యతలు స్వీకరించారు.  

Advertisement
 
Advertisement
Advertisement