అమీర్‌పేట: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువతిని ఓ వ్యక్తి ఇంటికి పిలిచి లైంగిక దాడికి యత్నించాడు. ఎస్‌ఆర్‌నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏపీలోని విజయవాడకు చెందిన 29 ఏళ్ల యువతి నగరంలోని ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తూ బంజారాహిల్స్‌లో నివాసం ఉంటుంది. ఈమెకు అమీర్‌పేట ధరం కరం రోడ్డులోని ఓ అపార్ట్‌మెంట్ పెంట్ హౌజ్‌లో ఉంటున్న అర్జున్‌రెడ్డితో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైంది.
స్నేహం పేరుతో దగ్గరైన అర్జున్‌రెడ్డి ఈ నెల 1న యువతిని తన ఇంటికి పిలిచాడు. మద్యం తాగిన అర్జున్ ఆ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించి లైంగిక దాడికి యతి్నంచాడు. దీంతో భయపడిన యువతి తీవ్రంగా ప్రతిఘటించి, అతడి నుండి తప్పించుకుని తన నివాసానికి చేరుకుంది. బుధవారం బాధితురాలు ఎస్‌ఆర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


