విద్యా​ర్థుల కోసం.. ఇది సరికొత్త ఎడ్యుకేషన్‌

Hyderabad: Kitolit Teaching Company Made Humanoid Robot Design Manikonda - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుత రోజుల్లో విద్యాసంస్థలు సంఖ్య రోజు రోజూకీ పెరుగుతున్నాయి. అలాగే వాటిలో చేరుతున్న విద్యార్ధుల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. అయితే కళాశాలల నుంచి బయటకు వస్తున్న గ్రాడ్యుయేట్లు ఉద్యోగులకు మారేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. దీనికి ప్రస్తుతం విద్యా విధానంలో రెగులర్‌ పాఠ్యాంశాలతో పాటు పాక్ట్రికల్‌తో కూడిన విద్యను పక్కన పెట్టడమే కారణమని విద్యావేత్తలు చెబుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కొన్ని స్టార్ట్‌ప్‌లు ముందుకు వస్తున్నాయి.

ప్రాక్టికల్‌ ఒక డిజైన్‌ ఎలా చేయాలి, ఒక ఎలక్ట్రానిక్స్‌ పరికరాలను ఎలా జతచేయాలి , వాటిని ప్రోగ్రాం ద్వారా ఎలా కంట్రోల్‌ చేయాలి, కనీసం ఒక ఇంకుబేషన్‌ సెంటర్‌.. ఇవన్నీ ప్రస్తుతం కాలేజీ స్థాయిలో కూడా మనకు ఎక్కడా కనిపించడం లేదు. వీటిని విద్యార్థులకు అందించేందుకు ముందుకు వచ్చింది మణికొండలోని కిటోలిట్‌(KITOLIT)కంపెనీ. దీనిపై సంస్థ వ్యవస్థాపకులు మాట్లాడుతూ.. ‘విద్యార్థులకు లేటెస్ట్‌ టెక్నాలజీతో ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ను అందించడమే మా లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకు స్కూల్స్‌తో టె​క్నికల పార్టనర్స్‌గా వ్యవహరిస్తున్నాం. వీటితో పాటు ఇతర దేశాలలో ఉన్న మా క్లయింట్స్‌తో కూడా ఆన్‌లైన్‌ సెషన్స్‌ జరిపిస్తుంటాం. తక్కువ ధరకే అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీతో రోబోను తయారు చేయడమే మా విజన్‌గా పెట్టుకున్నాం. అందులో ఏఐ టెక్నాలజీ, మిషిన్‌ లెర్నింగ్‌ ఉపయోగిస్తున్నాం. వీటితో పాటు సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కారును కూడా డిజైన్‌ చేస్తున్నామని’ పేర్కొన్నారు. ఇక్కడ తాము టెక్నాలజీతో కూడిన విద్యను ప్రాక్టికల్‌గా అందిస్తున్నామన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top