అపార్ట్‌మెంట్‌లో అక్కా చెల్లెళ్లు మృతి | Hyderabad Elder Sister Incident | Sakshi
Sakshi News home page

అపార్ట్‌మెంట్‌లో అక్కా చెల్లెళ్లు మృతి

Apr 16 2025 9:49 AM | Updated on Apr 16 2025 11:22 AM

Hyderabad Elder Sister Incident

హైదరాబాద్‌: మానసిక స్థితి సరిగా లేని ఇద్దరు అక్కచెల్లెళ్లు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కార్ఖాన పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ నరేష్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. స్థానిక మనోవికాస్‌ నగర్‌ శ్రీనిధి ఆపార్ట్‌మెంట్‌లో మీనా చంద్రన్‌ (59 ), వీణా చంద్రన్‌ (60) అనే అక్కా చెల్లెళ్లు నివాసం ఉంటున్నారు.

 వీరు చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతుండటమేగాక మానసిక స్థితి సరిగా లేదు.  ఈనెల 11న ఇంట్లో తలుపులు వేసుకుని విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గది నుంచి దుర్వాసన æవస్తుండటాన్ని గుర్తించిన స్థానికులు 13 సాయంత్రం కార్ఖాన పోలీసులకు, మారేడుపల్లిలో ఉంటున్న మరో సోదరి సాధనకు సమాచారం అందించారు. 

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారి మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. వీరి తండ్రి చంద్రన్‌ రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగి కాగా అతను మృతి చెందడంతో గత కొన్నేళ్లుగా అతని పెన్షన్‌ డబ్బులతో వీరు జీవనం సాగిస్తున్నారని వీరి సోదరుడు దుబాయ్‌లో ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా మానసిక స్థితి సరిగా లేని వీరు వింతగా ప్రవర్తిస్తూ ఆపార్ట్‌మెంట్‌ వాసులను ఇబ్బందులకు గురిచేసే వారని పలుమార్లు వీరిపై పోలీసులకు ఫిర్యాదులు చేయడంతో కౌన్సెలింగ్‌ ఇచ్చినట్లు ఎస్‌ఐ తెలిపారు. సీఐ రామకృష్ణ నేతృత్వంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.    

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement