భర్తను దారుణంగా చంపిన భార్య | Husnabad Wife And Husband Incident | Sakshi
Sakshi News home page

భర్తను దారుణంగా చంపిన భార్య

Oct 12 2026 11:28 AM | Updated on Oct 12 2026 11:35 AM

Husnabad Wife And Husband Incident

సిద్ధిపేట జిల్లా: కత్తితో పొడిచి చంపేస్తానని బెదిరి స్తుండడంతో కోపంతో ఊగిపోయిన భార్య కారం పొడి చల్లి తాడుతో చెట్టుకు కట్టేసి భర్తను చంపేసింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం సేవాలాల్‌ మహారాజ్‌తండా గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. తండాకు చెందిన రాజేశ్వరికి ఒక కూతురు ఉంది. భర్త చనిపోవడంతో 15 ఏళ్ల క్రితం నర్మెట మండలం మలకపేట్‌తండాకు చెందిన బానోతు భగవాన్‌ (43)తో వివాహం అయ్యింది. 

వీరిద్దరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అయితే రాజేశ్వరి–భగవాన్‌ దంపతుల మధ్య తరచు గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం రాజేశ్వరి తల్లిగారింటికి వచ్చింది. భగవాన్‌ అక్కడకు వచ్చి కత్తితో అందరిని పొడిచి చంపేస్తానని బెదిరించాడు. దీంతో విసిగిపోయిన రాజేశ్వరి తన భర్తనుచెట్టుకు కట్టేసింది. ఆ తర్వాత కర్రతో పాటు పక్కనే ఉన్న బండరాళ్లతో కిరాతకంగా కొట్టి చంపేసింది. ఆ తర్వాత భర్తను తనే చంపేశానని నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. రాజేశ్వరికి మొదటి భర్తకు జన్మించిన కూతురును భగవాన్‌ వేధిస్తుండడంతో హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement