తెలంగాణకు కోటా పెంచుతాం!: కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌

Harsh Vardhan Assures Enhancing Telangana Quota Of Oxygen Vaccines - Sakshi

రెమిడెసివిర్, వ్యాక్సిన్లు, కిట్లపై కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ హామీ

తెలంగాణలో కోవిడ్‌ ఉధృతి తగ్గుముఖం పట్టడంపై సంతృప్తి

కరోనా పరిస్థితులపై రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స్‌  

సీఎం ఆదేశాలతో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పడుతోందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రి హర్షవర్ధన్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణకు ఆక్సిజన్, రెమిడెసివిర్‌ ఇంజెక్షన్లు, వ్యాక్సిన్లు, టెస్టింగ్‌ కిట్లు, వెంటిలేటర్లు తదితర కరోనా సంబంధిత మందుల సామగ్రి కోటాను పెంచి సత్వర సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి బుధవారం రాష్ట్రాలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో.. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రగతిభవన్‌ నుంచి మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. కరోనా తొలివేవ్‌తో పోలిస్తే రెండో వేవ్‌ నాటికి రాష్ట్రంలో వైద్య సదుపాయాలను ప్రభుత్వం గణనీయంగా పెంచిందన్నారు.

కరోనా చికిత్స బెడ్లను 18,232 నుంచి 53,775కు, ఆక్సిజన్‌ బెడ్లను 9,213 నుంచి 20,738కు, ఐసీయూ బెడ్లను 3,264 నుంచి 11,274కు పెంచామని వివరించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలతో కూడిన 27,039 బృందాలు ఇంటింటికీS తిరిగి సర్వే నిర్వహించి కరోనా లక్షణాలున్న వారికి మందుల కిట్లు పంపిణీ చేస్తున్నాయని తెలిపారు. 60 లక్షల గృహాల్లో సర్వే నిర్వహించామని, ఈ కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోందన్నారు. 

పొరుగు రాష్ట్రాల రోగులను పరిగణనలోకి తీసుకోవాలి...  
తెలంగాణ మెడికల్‌ హబ్‌ కావడంతో చుట్టుపక్కల మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్‌గా నమోదైన వారు తెలంగాణకు వచ్చి చికిత్స పొందుతుండటంతో కోవిడ్‌ పాజిటివ్‌ లెక్కల్లో తేడా వస్తోందని హరీశ్‌ చెప్పారు. ఇది తెలంగాణ ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారిందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణకు జనాభా ప్రాతిపదికన కాకుండా, రాష్ట్రంలో నమోదవుతున్న పాజిటివ్‌ కేసులకు.. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న కరోనా కేసులను కలుపుకొని బెడ్ల సంఖ్య ఆధారంగా ఆక్సిజన్, మందులు, ఇతర కేటాయింపులు జరపాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మందుల కొరత పెరగడానికి లెక్కల్లో ఈ తేడాలే ప్రధాన కారణమన్నారు. ఆక్సిజన్‌ కేటాయింపులను 450 మెట్రిక్‌ టన్నుల నుంచి 600 మెట్రిక్‌ టన్నులకు పెంచాలన్నారు.

ఒడిశా తదితర సుదూర ప్రాంతాల నుంచి కాకుండా, దగ్గరలోని ఏపీ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుంచి క్రయోజనిక్‌ ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలన్నారు. కేసీఆర్‌ ఇప్పటికే కోరిన విధంగా 20 వేల రెమిడెసివిర్‌ ఇంజెక్షన్లను సరఫరా చేయాలని విజ్ఞప్తిచేశారు. టోసిలీ జుమాబ్‌ ఇంజెక్షన్లను 810 నుంచి 1,500కు పెంచాలని, రోజుకు 2లక్షల టెస్టింగ్‌ కిట్లను సరఫరా చేయాలని కోరారు. మొదటి డోస్‌ కోసం 96 లక్షల వ్యాక్సిన్లు, రెండో డోస్‌ పూర్తికి 33 లక్షల వ్యాక్సిన్లు కలిపి మొత్తం కోటి 29 లక్షల వ్యాక్సిన్లు అవసరమని తెలిపారు. ఈనెలాఖరులోగా 10 లక్షల కోవిషీల్డ్‌ వ్యాక్సిన్లు, 3 లక్షల కోవాగ్జిన్‌ వ్యాక్సిన్లు కలిపి మొత్తం 13 లక్షల వ్యాక్సిన్లు తక్షణంగా కావాలని, ఈ మేరకు రాష్ట్రానికి సరఫరా చేయాలన్నారు. 2వేల వెంటిలేటర్లు రాష్ట్రానికి కావాలని, తక్షణమే సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తుల పట్ల కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో సీఎం సెక్రటరీ, కోవిడ్‌ ప్రత్యేక అధికారి రాజశేఖర్‌ రెడ్డి, హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్‌ రెడ్డి, టెక్నికల్‌ అడ్వయిజర్‌ గంగాధర్‌ పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

13-05-2021
May 13, 2021, 04:18 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ తర్వాత ప్రతి ఇంటా వినిపిస్తున్న మాట ‘వేరియంట్‌’. శాస్త్రీయంగా దీని గురించి ప్రజలకు...
13-05-2021
May 13, 2021, 04:05 IST
కేయూ క్యాంపస్‌ (వరంగల్‌): నిజామాబాద్‌లోని తెలంగాణ యూనివర్సిటీ మాజీ ఉప కులపతి, కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్‌ ఆచార్యులు, వరంగల్‌కు చెందిన...
13-05-2021
May 13, 2021, 03:53 IST
సాక్షి, అమరావతి: కరోనా కట్టడికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం సర్పంచుల ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీలను...
13-05-2021
May 13, 2021, 03:47 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌ ఉధృతి నేపథ్యంలో ప్రత్యేకంగా పెద్ద ఎత్తున వైద్య సిబ్బంది నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. రెగ్యులర్‌...
13-05-2021
May 13, 2021, 03:24 IST
సాక్షి, గాంధీ ఆస్పత్రి: బాబోయ్‌ కరోనా అంటూ యువతే బయపడుతున్న వేళ.. 110 యేళ్ల తాత ధైర్యంగా వైరస్‌ను జయించాడు. ఇప్పటివరకు...
13-05-2021
May 13, 2021, 03:17 IST
సాక్షి, హైదరాబాద్‌:  ‘కరోనా వ్యాక్సిన్‌ తొలి డోసు తీసుకున్నాక రెండో డోసు తీసుకోవడం ఆలస్యమైతే వృథా అవుతుందా? నిర్దిష్ట గడువు...
13-05-2021
May 13, 2021, 03:11 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనాకు స్పష్టమైన చికిత్స లేదు. శాస్త్రీయంగా రుజువులు ఉన్న మందులను చికిత్సకు ఉపయోగిస్తున్నారు. అయితే భారత్‌లో కొందరు...
13-05-2021
May 13, 2021, 02:46 IST
సాక్షి ముంబై: మహారాష్ట్రలో మే 31వ తేదీ వరకు లాక్‌డౌన్‌ ఆంక్షలు పొడిగించనున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే అధ్యక్షతన...
13-05-2021
May 13, 2021, 02:26 IST
సాక్షి నెట్‌వర్క్‌:  రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తొలి రోజు లాక్‌డౌన్‌ పకడ్బందీగా జరిగింది. ఉదయం ఆరు నుంచి పది గంటల...
13-05-2021
May 13, 2021, 01:58 IST
సాక్షి, హైదరాబాద్‌: ప్రజల ప్రాణాలు కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర పురపాలక, పరిశ్రమల శాఖ...
13-05-2021
May 13, 2021, 01:37 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ తొలి రోజు బుధవారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం...
13-05-2021
May 13, 2021, 01:34 IST
న్యూఢిల్లీ: దేశంలోని ప్రజలను పట్టించుకోకుండా విదేశాలకు వ్యాక్సిన్లను పంపడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అధికార...
13-05-2021
May 13, 2021, 00:51 IST
న్యూఢిల్లీ: బిహార్‌లోని గంగా నదిలో భారీ సంఖ్యలో కరోనా బాధితుల మృతదేహాలు కొట్టుకురావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గంగా పరీవాహక...
13-05-2021
May 13, 2021, 00:49 IST
భారత్‌లో కనీవినీ ఎరుగని విధ్వంసానికి కారణమవుతున్న కొత్త రకం కరోనా వైరస్‌ వెనక ఉన్న అసలు వాస్తవాన్ని అంచనా వేస్తున్నదానికంటే...
13-05-2021
May 13, 2021, 00:30 IST
దేశంలో కోవిడ్‌ టీకామందు (వాక్సిన్‌) అవసరం, కొరత తీవ్ర స్థాయికి చేరింది. పలు రాష్ట్ర ప్రభు త్వాలను ఆందోళనకు గురిచేస్తోంది....
12-05-2021
May 12, 2021, 21:45 IST
సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో బుధవారం మంత్రి కేటీఆర్ అధ్యక్షతన కరోనా టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశం అయ్యింది. ఈ సమావేశానికి  సీఎస్, వివిధ శాఖల...
12-05-2021
May 12, 2021, 20:47 IST
ముంబై: కరోనా పాజిటివ్‌ అని తెలియగానే తాను చాలా భయపడిపోయానని ఎస్‌ఆర్‌హెచ్‌ వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా పేర్కొన్నాడు.  ఈ సీజన్‌లో...
12-05-2021
May 12, 2021, 18:58 IST
సాక్షి, అమరావతి: గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 90,750 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 21,452 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 13,44,386...
12-05-2021
May 12, 2021, 17:20 IST
ప్రాణాలు కోల్పోవడం కన్నా మాస్క్‌ ధరించడం ఏంతో మేలు
12-05-2021
May 12, 2021, 16:27 IST
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు వైద్యులు, వైద్య సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో ముంబైలోని డాక్టర్‌ దంపతులు...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top