సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోకపోతే బీఆర్‌ఎస్ ఆధ్యర్వంలో పోరాటం ఉద్ధృతం చేస్తామని మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు.ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదని ముమ్మాటికీ కాంగ్రెస్ తెచ్చిన కరువేనన్నారు. ఈ రోజు మంగళవారం సాక్షితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావం ఉందని తెలిసినా ప్రభుత్వం మేల్కోలేదని కృష్ణా జలాలను ఒడిసి పట్టుకోవడంలో సీఎం రేవంత్ విఫలమయ్యారని హరీష్ రావు ఆరోపించారు.
అదే విధంగా అవినీతిమయమైన పీఎంయూ కేంద్రీకృత టెండర్లను వెంటనే రద్దు చేసి, పాత పద్ధతిలోనే స్థానిక వెండర్ల ద్వారా ప్రభుత్వ హాస్టళ్లకు సరుకులు సరఫరా చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో సరుకుల సరఫరా కోసం తెచ్చిన కేంద్రీకృత పీఎంయూ టెండర్లను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
హరీష్ రావు "గతంలో మాదిరిగానే పాఠశాలను ఒక యూనిట్‌గా తీసుకుని, డిస్ట్రిక్ట్ పర్చేస్ కమిటీ (DPC) ద్వారా స్థానిక వెండర్లకే నిత్యావసర సరుకుల సరఫరా బాధ్యతలు అప్పగించాలి.పాత విధానాన్ని కొనసాగించడం ద్వారా జీవనోపాధి కోల్పోతున్న వేలమంది చిరు వ్యాపార కుటుంబాల భవిష్యత్తును కాపాడటంతో పాటు, విద్యార్థులకు నాణ్యమైన, తాజా సరుకులు అందుతాయి.ప్రభుత్వ పెద్దల కమీషన్ల కోసం బ్లాక్‌లిస్ట్ సంస్థకు టెండర్ కట్టబెట్టడం దుర్మార్గమన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెట్టి మూడు నెలల్లోనే విఫలమై రద్దయిన విధానాన్ని.. ఎవరి స్వలాభం కోసం తెలంగాణలో రుద్దుతున్నారని ప్రశ్నించారు.
ఇదీ చదవండి:సీఈఓ పేరుతో రూ.2.7 కోట్లు టోకరా


