విషాదం: మిమిక్రీ సత్యనారాయణ మృతి | Hyderabad Mimicry Artist Satyanarayana Tragedy | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో మిమిక్రీ కళాకారుడు దుర్మరణం

Oct 13 2026 3:13 PM | Updated on Oct 13 2026 3:18 PM

Hyderabad Mimicry Artist Satyanarayana Tragedy

సత్యనారాయణ (ఫైల్ ఫొటో)

సాక్షి, హైద‌రాబాద్‌: బతుకమ్మ ఈవెంట్‌లో పాల్గొని తిరుగు పయనమైన మిమిక్రీ కళాకారుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. హయత్‌నగర్‌ పోలీసులు తెలిపిన మేరకు.. హయత్‌నగర్‌ సాయినగర్‌ కాలనీలో మిమిక్రీ కళాకారుడు సత్యనారాయణ(40) నివాసముంటున్నాడు. 15 ఏళ్లుగా 2000 ప్రదర్శనలు చేసిన ఆయన వెంట్రిలాక్విజం, మ్యాజిక్‌లోనూ ప్రదర్శనలు ఇస్తుంటారు.

ఆదివారం అర్థరాత్రి హఫీజ్‌పేట సమీపంలో జరిగిన బతుకమ్మ కార్యక్రమం ముగించుకొని తిరిగి తన కారులో ఔటర్‌ రింగ్‌రోడ్డు మీదుగా హయత్‌నగర్‌ రోడ్డులో ప్రయాణిస్తున్నారు. రాత్రి 1.30 గంటల సమయంలో వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం సత్యనారాయణ కారును బలంగా ఢీకొట్టింది. దీంతో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టడడంతో సత్యనారాయణ అక్కడికక్కడే మృతిచెందాడు.  

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కారులో  మృతదేహాన్ని బయటకు తీసి ఉస్మానియా మార్చురికీ తరలించారు. కాగా, మిమిక్రీ, మ్యాజిక్‌ కళాకారుడుగా సత్యనారాయణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో అవార్డులు, రివార్డులు గెలుచుకున్నారు. సత్యనారాయణ మృతి ప‌ట్ల అభిమానులు, క‌ళాకారులు, స‌న్నిహితులు సంతాపం తెలిపారు. 

ఇదీ చ‌ద‌వండి: బాలిక కిడ్నాప్‌ ఉదంతం విషాదాంతం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement