కిడ్నాప్‌ ఉదంతం విషాదాంతం! | Koukoor Five Year Old Girl Murder Hyderabad Telangana | Sakshi
Sakshi News home page

కిడ్నాప్‌ ఉదంతం విషాదాంతం!

Oct 12 2026 6:00 AM | Updated on Oct 12 2026 6:00 AM

Koukoor Five Year Old Girl Murder Hyderabad Telangana

కౌకూర్‌లో ఐదేళ్ల చిన్నారి దారుణ హత్య

రూ.20 లక్షల కోసం కిడ్నాప్‌.. ఆపై దుశ్చర్య

తెలంగాణ: అంతర్జాతీయ బాలికా దినోత్సవం, దేవీ శరన్నవరాత్రులు ప్రారంభమైన తొలిరోజు.. బాలా త్రిపుర సుందరీ దేవి అవతారంలో అమ్మవారిని పూజిస్తూ, బాలికలను దైవ స్వరూపాలుగా భావించే వేళ మేడ్చల్‌ జిల్లా కౌకూర్‌లో ఐదేళ్ల చిన్నారి హత్య ఘటన కలచివేసింది. బొల్లారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని విల్లా ఆర్కిడ్స్‌లో నివసించే అరేలియా మోజెస్‌ కిడ్నాప్, హత్య స్థానికంగా తీవ్ర విషా దాన్ని నింపింది. పోలీసుల కథనం ప్రకారం.. విల్లా నంబర్‌ 84లో నివసించే మిల్టన్‌ ఫెర్నాండెజ్‌ కుమార్తె అరేలియా మోజెస్‌ శనివారం సాయంత్రం ఆడుకుంటూ కనిపించకుండా పోయింది.

కుటుంబ సభ్యులు పరిసరాల్లో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమె రాల దృశ్యాలను పరిశీలించిన పోలీసులు.. చిన్నారి వెనుక అదే నివాస సముదాయంలో గతంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన విక్రమ్‌ వెళ్లినట్లు గుర్తించినట్లు సమాచారం. అనంతరం క్లబ్‌హౌస్‌ సెల్లార్‌లోని నీటి సంపులో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. చిన్నారి కాళ్లు, చేతులు కట్టేసిన స్థితిలో మృతదేహం లభించింది. కేసు నమోదు చేసిన పోలీసులు హత్యకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారిని అపహరించిన అనంతరం రూ.20 లక్షలు డిమాండ్‌ చేసినట్లు విచారణలో వెల్లడైంది.

గాలిస్తున్న ప్రత్యేక బృందాలు
మొబైల్‌ సిగ్నల్స్‌ ఆధారంగా నిందితుడి ఆచూకీ కోసం పోలీ సులు గాలిస్తున్నారు. తొలుత సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ పరిసరాల్లో, ఆ తర్వాత పటాన్‌చెరులో అతడి ఫోన్‌ సిగ్నల్స్‌ గుర్తించినట్లు సమాచారం. నిందితుడు విక్రమ్‌ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు సమాచారం. విక్రమ్‌ ప్రవర్తనపై ఫిర్యాదులు రావడంతో ఉద్యోగం నుంచి తొలగించారని, కక్షతోనే చిన్నారిని అపహరించి హత్య చేశాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఎంపీ ఈటల రాజేందర్‌ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

చంపేసి.. ఆపై సంపులో వేసి..
గాంధీ ఆస్పత్రి మార్చురీలో అరేలియా మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. చిన్నారిని చంపేసిన తర్వాతే నీటి సంపులో పడేసినట్లు పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. చిన్నారి మెడకు నైలాన్‌ తాడుతో ఉరివేసిన దుండగుడు, చనిపోయిందని నిర్ధారించుకున్నాక అదే తాడుతో కాళ్లు, చేతులను వెనుకకు మడిచి కట్టేసి నీటి సంపులో పడేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. చిన్నారిపై అత్యాచారం చేసిన ఆనవాళ్లు లేవని, నమూనాలు సేకరించి ల్యాబోరేటరీకి పంపినట్లు ఫోరెన్సిక్‌ వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం చిన్నారి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ఇదీ చదవండి: నాయుడుపేటలో యువకుడి దారుణహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement