breaking news
Bolarum police
-
కిడ్నాప్ ఉదంతం విషాదాంతం!
తెలంగాణ: అంతర్జాతీయ బాలికా దినోత్సవం, దేవీ శరన్నవరాత్రులు ప్రారంభమైన తొలిరోజు.. బాలా త్రిపుర సుందరీ దేవి అవతారంలో అమ్మవారిని పూజిస్తూ, బాలికలను దైవ స్వరూపాలుగా భావించే వేళ మేడ్చల్ జిల్లా కౌకూర్‌లో ఐదేళ్ల చిన్నారి హత్య ఘటన కలచివేసింది. బొల్లారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని విల్లా ఆర్కిడ్స్లో నివసించే అరేలియా మోజెస్ కిడ్నాప్, హత్య స్థానికంగా తీవ్ర విషా దాన్ని నింపింది. పోలీసుల కథనం ప్రకారం.. విల్లా నంబర్ 84లో నివసించే మిల్టన్ ఫెర్నాండెజ్ కుమార్తె అరేలియా మోజెస్ శనివారం సాయంత్రం ఆడుకుంటూ కనిపించకుండా పోయింది.కుటుంబ సభ్యులు పరిసరాల్లో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమె రాల దృశ్యాలను పరిశీలించిన పోలీసులు.. చిన్నారి వెనుక అదే నివాస సముదాయంలో గతంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన విక్రమ్ వెళ్లినట్లు గుర్తించినట్లు సమాచారం. అనంతరం క్లబ్‌హౌస్ సెల్లార్‌లోని నీటి సంపులో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. చిన్నారి కాళ్లు, చేతులు కట్టేసిన స్థితిలో మృతదేహం లభించింది. కేసు నమోదు చేసిన పోలీసులు హత్యకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారిని అపహరించిన అనంతరం రూ.20 లక్షలు డిమాండ్ చేసినట్లు విచారణలో వెల్లడైంది.గాలిస్తున్న ప్రత్యేక బృందాలుమొబైల్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుడి ఆచూకీ కోసం పోలీ సులు గాలిస్తున్నారు. తొలుత సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పరిసరాల్లో, ఆ తర్వాత పటాన్చెరులో అతడి ఫోన్ సిగ్నల్స్ గుర్తించినట్లు సమాచారం. నిందితుడు విక్రమ్ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు సమాచారం. విక్రమ్ ప్రవర్తనపై ఫిర్యాదులు రావడంతో ఉద్యోగం నుంచి తొలగించారని, కక్షతోనే చిన్నారిని అపహరించి హత్య చేశాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఎంపీ ఈటల రాజేందర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.చంపేసి.. ఆపై సంపులో వేసి..గాంధీ ఆస్పత్రి మార్చురీలో అరేలియా మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. చిన్నారిని చంపేసిన తర్వాతే నీటి సంపులో పడేసినట్లు పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. చిన్నారి మెడకు నైలాన్ తాడుతో ఉరివేసిన దుండగుడు, చనిపోయిందని నిర్ధారించుకున్నాక అదే తాడుతో కాళ్లు, చేతులను వెనుకకు మడిచి కట్టేసి నీటి సంపులో పడేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. చిన్నారిపై అత్యాచారం చేసిన ఆనవాళ్లు లేవని, నమూనాలు సేకరించి ల్యాబోరేటరీకి పంపినట్లు ఫోరెన్సిక్ వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం చిన్నారి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.ఇదీ చదవండి: నాయుడుపేటలో యువకుడి దారుణహత్య -
పోలీసులపై మిలటరీ సిబ్బంది దౌర్జన్యం?
బొల్లారంలో సంచలనం బొల్లారం: రాత్రి పూట కారు ఆపి ఇక్కడ మద్యం తాగుతున్నారేంటి? అని ప్రశ్నించిన పాపానికి గస్తీలో ఉన్న పోలీసులపై మిలటరీ సిబ్బంది దౌర్జన్యానికి పాల్పడ్డారు. విశ్వసనీయ సమాచారం మేరకు... రోజూ మాదిరిగానే శుక్రవారం రాత్రి బొల్లారం పోలీసులు స్థానిక మిలటరీ ఏరియాలో గస్తీకి వెళ్లారు. మిలటరీ ఆఫీసర్స్ మెస్ వద్ద కొందరు వ్యక్తులు కారు ఆపి మద్యం తాగుతున్నారు. ఇది గమనించిన పోలీసులు మిలటరీ ఏరియాలో మద్యం తాగున్నారేంటి? అని ప్రశ్నించి వారి ఫొటోలు తీయబోయారు. అంతలోనే మద్యం మత్తులో ఉన్న సుబేదార్ స్థాయి అధికారి పోలీసులతో వాగ్వాదానికి దిగి.. తమ సిబ్బందిని అక్కడి పిలిపించాడు. వచ్చి రాగానే వారు పోలీసులపై దౌర్జన్యం మొదలె ట్టారు. పోలీసులు వారి నుంచి తప్పించుకొనేందుకు యత్నించినా వెంటబడి మరీ తరిమికొట్టినట్టు తెలిసింది. ఈ సందర్భంగా పోలీసులకు తీవ్రగాయాలైనట్టు సమాచారం. కాగా, తమ తప్పు తెలుసుకున్న మిలటరీ అధికారులు శనివారం ఉదయం పోలీసుస్టేషన్‌కు వచ్చి తమను క్షమించాలని పోలీసు అధికారులను, గాయపడ్డ పోలీసులను వేడుకున్నట్టు తెలిసింది. అయితే, ఈ విషయాన్ని ఇటు పోలీసులు, అటు మిలటరీ అధికారులు గోప్యం ఉంచడటం గమనార్హం. గతంలో తిరుమలగిరి, కార్కాన తదితర ఠాణాల పరిధిలో ఇలాంటి ఘటనలు జరిగాయి. పోలీసులు కేసులు నమోదు చేయకుండా సర్ధుకుపోవడం జరుగుతోంది. సీఐ వివరణ: బొల్లారం సీఐ జగన్‌ను ఈ విషయమై వివరణ కోరగా... ‘అంతా మన వాళ్లే అంటూ’ విషయం దాట వేయడం గమనార్హం.


