హైకోర్టులో హరీష్ రావుకు ఊరట | Harish Rao Election Petition Dismissed | Sakshi
Sakshi News home page

హైకోర్టులో హరీష్ రావుకు ఊరట

Jun 10 2025 12:16 PM | Updated on Jun 10 2025 12:30 PM

Harish Rao Election Petition Dismissed

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ రావుకు హైకోర్టులో ఊరట దక్కింది. ఆయనపై దాఖలైన ఎన్నికల పిటిషన్‌ను  తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికల సమయంలో సరైన వివరాలు వెల్లడించలేదని చక్రధర్ గౌడ్ అనే అభ్యర్థి ఈ పిటిషన్‌ దాఖలు చేశారు.

నాడు ఎన్నికల నామినేషన్‌ దాఖలు చేసిన హరీష్‌ రావు తమ ఆస్తులను సరిగా వెల్లడించలేదని, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఆయన ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు చక్రధర్ గౌడ్ ఆరోపణలకు సరైన ఆధారాలు లేవని తేల్చిచెప్పింది. ఈ కేసులో హరీష్ రావు తరపున మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రాంచందర్ రావు వాదనలు వినిపించారు. 
 

ఇది కూడా చదవండి: ఢిల్లీకి సీఎం సిద్ధరామయ్య.. బెంగళూరు తొక్కిసలాటపై చర్చ?

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement